ETV Bharat / state

మెుట్టమెుదటి కార్గో ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించిన భారతీయ రైల్వే - hyderabad

భారతీయ రైల్వే కార్గో సేవలపై దృష్టి సారించింది. భారతీయ రైల్వేలో మొట్టమొదటి కార్గో ఎక్స్​ప్రెస్ రైలును దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. సరుకు రవాణా వేగంగా కచ్చితమైన సమయంలో చేరేందుకు ఈ రైళ్లు దోహదపడుతాయని రైల్వే శాఖ అభిప్రాయపడింది. హైదరాబాద్ - దిల్లీ మధ్య సరుకు రవాణా కార్యకలాపాల కోసం సనత్ నగర్ రైల్వే స్టేషన్​లో 5వ తేదీ నుంచి దక్షిణ మధ్య రైల్వే కార్గో రైలును నడిపిస్తోంది.

indian railway started cargo services
మెుట్టమెుదటి కార్గో ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించిన భారతీయ రైల్వే
author img

By

Published : Aug 7, 2020, 5:03 AM IST

భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా దక్షిణ మధ్య రైల్వే కార్గో రైలును హైదరాబాద్​లోని సనత్​నగర్ రైల్వే స్టేషన్ నుంచి దిల్లీలోని ఆదర్శ్ నగర్ స్టేషన్ల మధ్య ప్రారంభించింది. ఈ కార్గో ఎక్స్​ప్రెస్ రైలు ప్రతి బుధవారం బయలుదేరుతుంది. ఈ రైలును 6నెలల పాటు ప్రయోగాత్మకంగా నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. సాధారణంగా, సరుకు రవాణా రైళ్ల ద్వారా పలు పారిశ్రామిక ఉత్పత్తులు అధిక మొత్తాలలో రవాణా చేస్తారు. కానీ ఇటీవలి కాలంలో నెలకొన్న పరిస్థితుల మూలంగా స్వల్ప మొత్తాల్లో కూడా సరుకులను రవాణా చేసే సంస్థల సంఖ్య పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రంగంలో నెలకొన్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ వినియోగదారులకు విస్తృతమైన అవకాశాలను కల్పిస్తూ దక్షిణ మధ్య రైల్వే ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్గో ఎక్స్ ప్రెస్ సేవలతో సింగిల్ వ్యాగన్ బుక్ చేసుకునే వినియోగదారులకు సైతం వేగవంతమైన రవాణా సదుపాయం అందుబాటులోకి వచ్చింది.

తక్కువ ధరలకే..

ఇతర మార్గాలతో పోల్చితే వినియోగదారులకు తక్కువ ధరలకే వేగవంతమైన రవాణా సదపాయం లభిస్తుందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్ తెలిపారు. సనత్​నగర్ నుంచి ప్రారంభమైన ఈ కార్గో ఎక్స్​ప్రెస్ గంటకు 50 కి.మీ. వేగంతో ప్రయాణిస్తూ శుక్రవారం నాటికి దిల్లీలోని ఆదర్శనగర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుందన్నారు.ఈ కార్గో ఎక్స్​ప్రెస్ సేవలను వినియోగించుకునే సంస్థల కోసం రైల్వే శాఖ ప్రత్యేక హెల్ప్​లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది.

మెుట్టమెుదటి కార్గో ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించిన భారతీయ రైల్వే

ఇవీ చూడండి: కరోనా బాధితుల్లో ధైర్యం నింపేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి: ఈటల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.