ETV Bharat / state

హైదరాబాద్‌ వాసుల్ని ఉర్రూతలూగించిన రేసింగ్ పోటీలు.. నేడు అసలైన సమరం - Features of Hyderabad city

Indian Racing League in Hyderabad: రయ్‌రయ్‌మంటూ శబ్దాలు.. మెరుపు వేగంలో దూసుకెళ్తున్న కార్లు.. సరికొత్త సందడితో రేసింగ్ పోటీలు హైదరాబాద్‌ వాసుల్ని ఉర్రూతలూగించాయి. ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్ అట్టహాసంగా ప్రారంభమైంది. లీగ్‌ తొలి రోజు క్వాలిఫయర్ నిర్వహించాల్సి ఉండగా.. ట్రాక్‌పై అవగాహన కోసం డ్రైవర్లు రోజంతా సాధన చేశారు. ఇవాళ అసలు సిసలైన పోటీలు జరగనున్నాయి.

Indian Racing League
Indian Racing League
author img

By

Published : Nov 20, 2022, 6:47 AM IST

హైదరాబాద్‌ వాసుల్ని ఆకట్టుకున్న ఇండియన్ రేసింగ్ లీగ్‌

Indian Racing League in Hyderabad: హుస్సేన్‌సాగర్ తీరంలో రయ్ రయ్ అంటూ రేసింగ్ కార్ల శబ్దాలు సందడి చేశాయి. నిన్న మధ్యాహ్నం నుంచే పోటీలోని ఆరుజట్ల రేసర్లు ట్రాక్‌పై చక్కర్లు కొట్టారు. కారు రేస్‌ను చూసేందుకు వచ్చిన వీక్షకులతో.. ట్రాక్‌ చుట్టూ సందడి నెలకొంది. శనివారం క్వాలిఫయింగ్ 1, 2 లను.. ప్రధాన రేస్‌లను నిర్వహించాల్సి ఉండగా.. రేసర్లకు ట్రాక్‌పై అవగాహన కోసం ట్రయల్స్‌ మాత్రమే నిర్వహించారు. ఇవాళ ప్రధాన పోటీలు జరగనున్నాయి.

రేసింగ్‌లో 12 కార్లు, 6 జట్లు పాల్గొననుండగా.. ప్రతి జట్టులో నలుగురు డ్రైవర్లు ఉంటారు. వారిలో 50 శాతం స్వదేశీ రేసర్లుకాగా.. మరో 50 శాతం మంది విదేశీ రేసర్లు ఉన్నారు. మొత్తం 7వేల 500 మంది చూసేందుకు గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఈ రేసులో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, గోవా, దిల్లీ, కొచ్చి బృందాలు తలపడనున్నాయి. ఇండియన్ రేసింగ్‌ లీగ్‌ వంటి ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించడం గొప్ప విషయమని... రేసర్‌ అనిందిత్‌రెడ్డి తెలిపారు.

డ్రైవర్ భద్రతకు అధిక ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు. కొత్త ట్రాక్ కాబట్టి అర్థం చేసుకునేందుకు సమయం పడుతోందన్న రేసర్‌...ఆ ట్రాక్‌పై గరిష్ఠంగా గంటకు 240కిలోమీటర్ల వేగంతో కారు నడపవచ్చని తెలిపారు. ఇండియన్ రేసింగ్‌ లీగ్‌లో ట్రయల్‌ రేస్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్​.. కుమారుడితో కలిసి రేస్‌ను వీక్షించారు. ట్రాక్‌ గురించి రేసర్లతో ముచ్చటించారు. నిర్వహకులతో మాట్లాడి ఏర్పాట్లపై ఆరా తీశారు. సినీనటుడు నిఖిల్ ఐమ్యాక్స్ వద్ద రేసింగ్‌ సందడి చేశారు.

హైదరాబాద్‌లో ఇలాంటి ఈవెంట్ జరగడంతో ప్రేక్షలతోపాటు నగరవాసులు నెక్లెస్‌రోడ్‌కి తరలివచ్చారు. తెలుగుతల్లి పైవంతెన పైకి ఎక్కి రేసింగ్‌ను వీక్షించారు. రేసింగ్ కార్ల శబ్దాలు వింటుంటే.. ఉత్సాహంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. తొలిరోజు జరిగిన రేసింగ్‌ సాధనలో ప్రమాదం తప్పింది. ప్రసాద్ ఐ మ్యాక్ ఎదుట ట్రాక్ మీదుగా దూసుకెళ్తున్న ఓ కారుపై ఒక్కసారిగా చిన్న చెట్టు కొమ్మ పడింది. కారు కంట్రోల్ తప్పినా.. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించాడు. కొద్దిదూరంలో ట్రాక్ పక్కన కారును నిలిపివేశాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.