అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ పోలీసు పతకాలను ఇవాళ హైదరాబాద్‌లో ప్రదానం చేయనున్నారు. ప్రధానమంత్రి గ్యాలంటరీ అవార్డులు, సేవా పతకాలు, మహోన్నత సేవా పతకాలు ముఖ్యమంత్రి శౌర్య పతకం, ముఖ్యమంత్రి సర్వోన్నత పోలీసు పతకంతోపాటు పలు పోలీసు పతకాలు 418మంది సీనియర్ ఐపీఎస్, పోలీసు అధికారులు ఇతర సిబ్బందికి హోంమంత్రి మహమూద్ అలీ రవీంద్రభారతిలో ఇవ్వనున్నారు.
2014వ సంవత్సరం నుంచి 2020 వరకు ఇండియన్ పోలీసు మెడల్స్, ప్రధానమంత్రి పోలీసు మెడల్స్‌ను 122 మందికి ప్రదానం చేస్తారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అందించే ముఖ్యమంత్రి మహోన్నత పతకం శౌర్య పతకాలతో పాటు ఉత్తమ సేవా పతకాలను 296మందికి హోంమంత్రి అందజేయనున్నారు.
ఈ మెడల్స్ స్వీకరించే అధికారులలో ముగ్గురు అడిషనల్ డీజీపీలు, ఇద్దరు ఐజీలు, ముగ్గురు డీఐజీలు ముగ్గురు ఎస్పీలు 10మంది నాన్ కాడర్ ఎస్పీలు, కమాండెంట్స్, 29మంది అడిషనల్ ఎస్పీలు 53మంది డీస్పీలు 48మంది సీఐలు, 59మంది ఎస్‌ఐ, 76మంది ఏఎస్‌ఐలు 87మంది హెడ్ కానిస్టేబుళ్లు, 47మంది పోలీసు కానిస్టేబుళ్లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, ఇతర పోలీసు సినీయర్ అధికారులు పాల్గొననున్నారు.
ఇదీ చూడండి: పీసీసీ భేటీ... మున్సిపల్ ఎన్నికలపై చర్చ