కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, సహాయక చర్యల కోసం పలు సంస్థలు సీఎం సహాయ నిధికి విరాళమిచ్చి విపత్కాలంలో ప్రభుత్వానికి అండగా ఉంటున్నాయి. కరోనా కాలంలో తమ వంతు సాయంగా ఇండియన్ ఇమ్యునోలాజికల్ లిమిటెడ్ సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయలు విరాళం ప్రకటించింది. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును కంపెనీ ఎండీ డాక్టర్ కె.ఆనంద్ కుమార్తో కూడిన బృందం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్కు అందజేసింది.
ఇవీ చూడండి: ప్రపంచవ్యాప్తంగా అరకోటి దాటిన కరోనా కేసులు