ETV Bharat / state

Telangana New Secretariat : కొత్త సచివాలయానికి గోల్డ్‌ రేటింగ్‌ - ఐజీబీసీ గోల్డ్‌ రేటింగ్

IGBC Gold Rating to Telangana New Secretariat: తెలంగాణ సిగలో మరో అద్భుత కట్టడంగా రూపుదిద్దుకున్న కొత్త సచివాలయం ప్రతిష్ఠాత్మక ఐజీబీసీ గోల్డ్‌ రేటింగ్​కు ఎంపికైంది. దేశంలో ఈ రేటింగ్‌ లభించిన తొలి సచివాలయం మనదే కావడం విశేషం. తాజాగా సెక్రటేరియెట్‌ గోల్డ్‌ రేటింగ్‌కు ఎంపిక కావడంతో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన భవనాల్లో రెండింటికి ఈ రేటింగ్‌ లభించినట్లైంది.

IGBC Gold Rating
IGBC Gold Rating
author img

By

Published : Apr 29, 2023, 8:13 AM IST

IGBC Gold Rating to Telangana New Secretariat: రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన చేతుల మీదుగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలంగాణ సచివాలయ సౌధాన్ని రేపు లాంఛనంగా ప్రారంభించనున్నారు. హైదరాబాద్ సిగలో మరో మణిహారంగా రూపుదిద్దుకున్న ఈ అద్భుత కట్టడం.. తాజాగా గోల్డ్‌ రేటింగ్‌ కోసం ఎంపికైంది. ఈ మేరకు హరిత భవన మండలి హైదరాబాద్‌ చాప్టర్ ఛైర్మన్ సి.శేఖర్‌రెడ్డి వెల్లడించారు.

Gold Rating to Telangana New Secretariat : కొత్త సచివాలయం గోల్డ్‌ రేటింగ్‌కు ఎంపికైందని.. ఆ రేటింగ్‌ ప్రమాణాలను పాటించిన సచివాలయం దేశంలో మరొకటి లేదని సి.శేఖర్‌ రెడ్డి ఈనాడు-ఈటీవీ భారత్‌తో చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ కొత్త సచివాలయాన్ని హరిత భవన మండలి (ఐజీబీసీ-ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్) ప్రమాణాల మేరకు నిర్మించారని ఆయన స్పష్టం చేశారు.

సెక్రటేరియెట్‌లో 100 శాతం ఎల్‌ఈడీ వ్యవస్థను ఏర్పాటు చేశారని.. విద్యుత్‌ వినియోగాన్ని పర్యవేక్షించేందుకు బీఎంఎస్‌ (భవన నిర్వహణ వ్యవస్థ)ను ఏర్పాటు చేశారని శేఖర్‌ తెలిపారు. భవన ప్రాంగణంలో పచ్చదనం కోసం స్థానిక మొక్కలను తీసుకున్నారని.. సెంట్రల్‌ కోర్డు యార్డు నమూనాను వినియోగించారని వివరించారు. భవనాలను హరిత ప్రమాణాలతో నిర్మిస్తే.. అందులో పనిచేసే వారి ఉత్పాదకత పెరుగుతుందని, నీరు, విద్యుత్‌ వినియోగంలో 30-40 శాతం వరకు ఆదా అవుతుందని వెల్లడించారు.

గోల్డ్‌ రేటింగ్‌ ఎలా ఇస్తారంటే..: భవనాల నిర్మాణంలో హరిత ప్రమాణాలను పాటించినట్లు ఆయా సంస్థలు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్‌కు దరఖాస్తు చేసుకుంటాయి. అవి అలా ప్రమాణాలను పాటించాయో లేదో గుర్తించేందుకు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నిపుణులతో కౌన్సిల్‌ ఉంటుంది. ఆ నిపుణుల బృందం నిర్మాణాన్ని పరిశీలిస్తుంది. నిర్మాణ తీరు తెన్నులు తెలుసుకుంటుంది. ఐజీబీసీ ప్రమాణాల మేరకు నిర్మాణం జరిగినట్లు తేలితే అప్పుడు గోల్డ్‌ రేటింగ్‌ ఇస్తుంది.

గోల్డ్ రేటింగ్‌ రావాలంటే..: భవనాలకు గోల్డ్‌ రేటింగ్‌ దక్కాలంటే నిర్మాణంలో కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆ భవనంలోకి సహజ సిద్ధమైన గాలి, వెలుతురు పుష్కలంగా వచ్చేలా ఉండాలి. నీటి వృథాను నియంత్రించేందుకు సెన్సర్స్‌, ఆటోమేటిక్‌ విద్యుత్ పరికరాలు ఉపయోగించాలి. ఇవన్నీ చేస్తే.. పాటించిన నిబంధనల ప్రకారం ప్లాటినం, గోల్డ్‌, సిల్వర్‌, సర్టిఫికెట్‌.. ఇలా గుర్తింపు లభిస్తుంది.

ప్రభుత్వ భవనాల్లో రెండింటికి గోల్డ్‌ రేటింగ్..: నూతన సచివాలయానికి తాజాగా గోల్డ్‌ రేటింగ్‌ లభించడంతో రాష్ట్రప్రభుత్వం నిర్మించిన భవనాల్లో రెండింటికి ఈ రేటింగ్‌ లభించినట్లైంది. ఇంతకుముందు హైదరాబాద్‌లో నిర్మించిన పోలీస్ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు గోల్డ్‌ రేటింగ్ దక్కింది.

ఇవీ చూడండి..

TS New Secretariat: నూతన సచివాలయం ప్రారంభోత్సవ వేళ.. సంక్షేమంపై సీఎం సంతకం

TS Secretariat: కొత్త సచివాలయం డ్రోన్​ విజువల్స్.. అద్దిరిపోయాయంతే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.