ETV Bharat / state

శ్రీలంక మత్స్యకారులను కాపాడిన భారత కోస్ట్​గార్డ్స్ - సముద్రంలో చిక్కుకున్న శ్రీలంక మత్స్యకారులు న్యూస్

హిందూ మహా సముద్రంలో చిక్కుకున్న ఆరుగురు శ్రీలంక మత్స్యకారులను భారత్ కోస్ట్ గార్డ్ రక్షించింది. వీరు శ్రీలంక ట్రింకోమలి నుంచి చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లారు. అదే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా మారి వీరు ప్రయాణిస్తున్న బోట్ తలకిందులైంది.

indian-coast-guard-coordinates-rescue-operation-of-six-sri-lankan-fishermen
సముద్రంలో చిక్కుకున్న శ్రీలంక మత్స్యకారులు
author img

By

Published : Jul 6, 2020, 12:12 PM IST

హిందూ మహా సముద్రంలో చిక్కుకుని సాయం కోసం ఎదురుచూస్తున్న శ్రీలంక మత్స్యకారులను భారత్ కోస్ట్ గార్డ్ రక్షించింది. ఏపీలోని విశాఖ వైపు వస్తున్న మర్చంట్ నేవీ నౌక ఎం.వి.సుమిత్​లోని సిబ్బంది... సముద్రంలో కొంత మంది ప్రమాదంలో ఉన్న విషయాన్ని గుర్తించారు. సమాచారాన్ని కోస్ట్ గార్డ్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్​కి అందించారు. ఆరుగురు శ్రీలంక మత్స్యకారులను ప్రాణాపాయం నుంచి కాపాడారు. చేపల వేట కోసం వీరు సముద్రంలోకి వెళ్లినప్పుడు ఆ ప్రాంతం అల్లకల్లోలంగా మారి... వీరు ప్రయాణిస్తున్న బోట్​ తలకిందులైంది. బోటు అంచున వీరు వేలాడి.. సాయం కోసం వేచి చూసినట్లు నేవీ అధికారులు తెలిపారు. వారిని శ్రీలంకకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. చెన్నైకి తూర్పుగా 170 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది.

ఇదీ చదవండి: శుభవార్త: ఒక్కో రైతుకు నేరుగా రూ.1.60 లక్షలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.