ETV Bharat / state

ఔషధ తయారీకి భారతీయ భాగస్వామ్యాలు - gilead sciences american medical company

కరోనా వైరస్‌ వ్యాధి (కొవిడ్‌-19) బాధితులకు ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్న యాంటీ-వైరల్‌ ఔషధమైన ‘రెమిడెసివిర్‌’ను విస్తృత స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు అమెరికా సంస్థ గిలీడ్‌ సైన్సెస్‌ సన్నాహాలు చేస్తోంది. ఈ పక్రియలో భారతీయ ఔషధ కంపెనీలను భాగస్వాములను చేయనుంది.

indian partnerships in manufacture of remidesivir‌ medicine at usa
ఔషధ తయారీకి భారతీయ భాగస్వామ్యాలు
author img

By

Published : May 7, 2020, 12:43 PM IST

‘రెమిడెసివిర్‌’ ఔషధం కొవిడ్‌-19 బాధితులపై పనిచేస్తున్నట్లు ప్రాథమిక పరీక్షల్లో వెల్లడైనందున దీన్ని విస్తృత స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు అమెరికా సంస్థ గిలీడ్‌ సైన్సెస్‌ సన్నాహాలు చేస్తోంది. ఈ ఔషధం తయారీ, విక్రయాల్లో భారతీయ ఔషధ కంపెనీలను భాగస్వాములను చేయనుంది. దీన్ని కొవిడ్‌-19 బాధితులపై వినియోగించడానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) అత్యవసర అనుమతి (ఎమెర్జెన్సీ యూజ్‌ ఆథరైజేషన్‌) ఇచ్చింది. దీంతో ఔషధ పరీక్షలు, తయారీ యత్నాలను గిలీడ్‌ సైన్సెస్‌ వేగవంతం చేసింది. కొవిడ్‌-19కు ఇది సరైన ఔషధమేనని పూర్తిస్థాయిలో నిర్ధారణ అయితే, ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారిగా దీనికి విపరీతమైన డిమాండ్‌ ఏర్పడుతుంది.

అటువంటి పరిస్థితుల్లో సరఫరాలు పెంచేందుకు వీలుగా మనదేశంలో జనరిక్‌ ఔషధాలు తయారు చేసే కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవటానికి గిలీడ్‌ సైన్సెస్‌ సిద్ధపడుతోంది. ‘రెమిడెసివిర్‌’ ఔషధంపై గిలీడ్‌ సైన్సెస్‌కు దాదాపు 70 దేశాల్లో 2031 వరకు పేటెంట్లు ఉన్నాయి. అందువల్ల గిలీడ్‌ను కాదని ఇతర కంపెనీలు ఈ ఔషధాన్ని తయారు చేయటం సాధ్యం కాదు. భాగస్వామ్యాలు కుదుర్చుకోవటం ద్వారా మాత్రమే చేయొచ్చు. గతంలో స్వైన్‌ఫ్లూ వచ్చినప్పుడు కూడా, ఆ జబ్బును అదుపు చేసే ఔషధమైన ‘ఒసెల్టామివిర్‌’ ఔషధం తయారీకి గిలీడ్‌ సైన్సెస్‌ మనదేశంలోని ఫార్మా కంపెనీలను ‘వలంటరీ లైసెన్స్‌’ పద్ధతిలో భాగస్వాములను చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. అదే పద్ధతిని ఇప్పుడు అనుసరించనుంది.

తయారీ పరిజ్ఞానం బదిలీ!

ఒప్పందంలో భాగంగా ఎంపిక చేసుకున్న దేశీయ ఫార్మా కంపెనీలకు ఔషధ తయారీ పరిజ్ఞానాన్ని గిలీడ్‌ సైన్సెస్‌ బదిలీ చేస్తుంది. భాగస్వామ్యాల విషయంలో కొన్ని ఐరోపా దేశాలు, ఆసియాలోని భారత్‌, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ దేశాల్లోని కొన్ని జనరిక్‌ ఫార్మా కంపెనీలతో సంప్రదింపులు చేపట్టినట్లు సమాచారం. రెండు మూడు రోజుల్లో అధికారికంగా కొన్ని ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉందని తెలిసింది. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కంపెనీలతో కలిసి ‘తయారీదార్ల బృందాన్ని’ ఏర్పాటు చేయనున్నట్లు, తద్వారా తక్కువ సమయంలో విస్తృత స్థాయిలో ఈ ఔషధాన్ని అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు గిలీడ్‌ సైన్సెస్‌ వెల్లడించింది.

పోటీలో హైదరాబాద్‌ కంపెనీలు?

మనదేశంలో గతంలో గిలీడ్‌ సైన్సెస్‌తో ఒసెల్టామివిర్‌ (స్వైన్‌ఫ్లూ ఔషధం), సొఫొస్‌బువిర్‌ (హెపటైటిస్‌-సి ఔషధం) మందుల తయారీలో పలు ఫార్మా కంపెనీలు భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇందులో హైదరాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీలు ఉన్నాయి. అంతేగాకుండా గిలీడ్‌ ‘హెపటైటిస్‌-సి’ ఔషధ తయారీ విషయంలో సిప్లా అతిపెద్ద భాగస్వామిగా ఉండటం గమనార్హం.

కానీ ‘రెమిడెవిర్‌’ కు సంబంధించి మనదేశంలో ఏఏ కంపెనీలతో తయారీ ఒప్పందాలను కుదుర్చుకోబోతోందనే విషయం వెల్లడి కావటం లేదు. రెండు మూడు కంపెనీలతో భాగస్వామ్యం కుదిరే అవకాశం ఉన్నట్లు ఫార్మా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఏదేమైనా కొవిడ్‌-19 రూపంలో దేశీయ ఫార్మా కంపెనీలకు కొత్త అవకాశాలు వస్తున్నాయనే అంశాన్ని తాజా పరిణామాలు నిర్ధారిస్తున్నాయి.

ఇదీ చూడండి: 'అలుపన్నదే లేకుండా పోరాడితేనే కరోనాపై విజయం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.