ETV Bharat / state

India Day Celebrations in London : లండన్‌లో ఇండియా డే వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ దశాబ్ది వేడుకల లోగో

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 27, 2023, 6:52 PM IST

Independence Day Celebrations in London : భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా లండన్‌లో తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ ఆధ్వర్యంలో ఇండియా డే వేడుకలు జరిగాయి. దీనికి ముఖ్య అతిథిగా భారత హై కమిషనర్‌ దొరైస్వామి హాజరయి.. జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల స్టాల్‌ని అభినందించారు.

India Independence Day Celebrations in London
Telangana Decade Celebration Huge Logo

India Day Celebrations Under TAUK Organization : భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా లండన్‌లోని భారత హై కమిషన్, భారతదేశానికి చెందిన వివిధ రాష్ట్రాల ప్రవాస భారతీయుల సంఘాలతో సంయుక్తంగా 'ఇండియా డే' వేడుకలు జరిగాయి. తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) (TAUK), తెలంగాణా రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించింది. భారత హై కమిషనర్ దొరైస్వామి ముందుగా జెండా ఆవిష్కరించి, జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభించారు. యూకే నలుమూలల నుంచి వేలాది మంది ప్రవాస భారతీయులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల భారీ లోగోతో.. టాక్ సంస్థ ఏర్పాటు చేసిన స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్ర ప్రత్యేకతను, చరిత్రను, సంస్కృతి, పర్యాటక ప్రదేశాల ప్రత్యేకత, గత తొమ్మిది సంవత్సరాలుగా సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన పథకాలు.. వాటి సమాచారాన్ని స్టాల్‌లో ప్రదర్శించి వివరించారు.

TAUK Full Form
Telangana Association of United Kingdom President

Telangana Tradition Stall in London : తెలంగాణా రాష్ట్ర ప్రాముఖ్యత, విశిష్టత గురించి వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులకు, విదేశీయులకి తెలియజేయాలనే భావనతో, టాక్ సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణా ప్రముఖులు, పెట్టుబడులకు అనుకూల నిర్ణయాల సమాచారాన్ని, సాధించిన విజయాలతో కూడిన ప్రత్యేక "తెలంగాణా స్టాల్" ని ఏర్పాటు చేశారని సంస్థ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల తెలిపారు. ఈ స్టాల్‌ను సందర్శించిన హై కమిషనర్ .. అందులో ఏర్పాటు చేసిన జాతీయ నాయకులు, తెలంగాణ ప్రముఖుల చిత్ర పటాలకి నివాళులర్పించారు. ప్రవాస తెలంగాణా బిడ్డలు స్టాల్‌ని సందర్శించి, రాష్ట్రానికి ప్రత్యేక స్టాల్‌ని చూడడం చాలా గర్వంగా ఉందని అభినందించారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల భారీ లోగో(Decade Logo)తో సెల్ఫీలు తీసుకున్నారు. దీంతో టాక్ సంస్థ స్టాల్ సందడిగా మారింది.

Telangana Decade Logo
Indian High Commissioner Doraiswamy

CM KCR Speech at Golconda Fort : 'తెలంగాణ ప్రగతి చూసి యావత్‌ దేశం ఆశ్చర్యపడుతోంది'

Telangana Decade Celebration Huge Logo in London : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల భారీ లోగో చేసి టాక్ స్టాల్‌ని ఎంతో అందంగా తెలంగాణ ప్రత్యేకతను చాటేలా నిర్మించిన టాక్ ముఖ్య నాయకులు మల్లా రెడ్డి, సహకరించిన అశోక్ గౌడ్, హరి నవాపేట్, సురేష్ బుడగం, నవీన్ రెడ్డిలను అధ్యక్షుడు రత్నాకర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. "తెలంగాణా స్టాల్" ని సందర్శించిన అతిథులందరికి "హైధారాబాద్ బిర్యానీ" రుచి చూపించారని ముఖ్య నాయకులు హరి నవాపేట్ నవీన్ రెడ్డి తెలిపారు. ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసుకొనే అవకాశం కలిపించిన భారత హై కమిషన్ అధికారులకు టాక్ ప్రధాన కార్యదర్శి సురేష్ బుడగం ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ప్రధాన కార్యదర్శి సురేష్ బుడగం, కార్యదర్శి హరిగౌడ్ నవాపేట్, కమ్యూనిటీ అఫైర్స్ చైర్పర్సన్ నవీన్ రెడ్డి, స్వాతి, స్నేహ, పూజ, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.

Independence Day Celebrations Under TAUK Organization
Hyderabad Biryani హైదరాబాద్‌ బిర్యానీ రుచి చూసిన ప్రవాస భారతీయులు

Independence Day Celebration 2023 Telangana : రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు..

Independence Day Awards Telangana 2023 : ఉత్తమ సేవకు ఉన్నత అవార్డులు.. జెండా పండుగ వేళ కేసీఆర్‌ చేతుల మీదుగా అవార్డులు

KTR on Independence Day Celebration : 'మన మున్సిపాలిటీలు, పట్టణాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.