ETV Bharat / state

అంతరిక్ష పరిశోధన కేంద్రానికి భారత్ దిక్సూచి : గవర్నర్

డాక్టర్ ఏపీజే అబ్ధుల్ కలాం అంతర్జాతీయ ఫౌండేషన్ నిర్వహించిన అంతరిక్ష పరిశోధన పెలోడ్ క్యూబ్స్ ఛాలెంజ్- 2021 కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

అంతరిక్ష పరిశోధన కేంద్రానికి దిక్సూచిగా భారత్: గవర్నర్

author img

By

Published : Feb 7, 2021, 7:40 PM IST

భారతదేశం అంతరిక్ష పరిశోధన కేంద్రానికి దిక్సూచిగా మారే అవకాశం ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆశాభావం వ్యక్తం చేశారు. అంతరిక్ష పరిశోధనలో మొదటి ఆరు దేశాల్లో మన దేశం కూడా ఉండడమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. డాక్టర్ ఏపీజే అబ్ధుల్ కలాం అంతర్జాతీయ ఫౌండేషన్ నిర్వహించిన డాక్టర్ ఏపీజే అబ్ధుల్ కలాం అంతరిక్ష పరిశోధన పెలోడ్ క్యూబ్స్ ఛాలెంజ్- 2021 కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

దేశంలో జరుగుతున్న భారీ అంతరిక్ష పరిశోధనలో స్వావలంబన, విదేశీ ఉపగ్రహాలను అతి తక్కువ ఖర్చుతో ప్రయోగించడం కీలకమైన అంశాలుగా గవర్నర్ పేర్కొన్నారు. విక్రమ్ సారాబాయ్, ఏపీజే అబ్ధుల్ కలాం, సతీశ్​ ధావన్ వంటి అనేకమంది ప్రముఖ శాస్త్రవేత్తలు దేశంలో అంతరిక్ష పరిశోధనల అభివృద్ధికి దోహదపడ్డారని తెలిపారు.

విద్యార్థులు వారు ఎంచుకున్న రంగంలో రాణించి దేశానికి పేరు తీసుకురావాలని గవర్నర్ ఆకాంక్షించారు. పెలోడ్ క్యూబ్స్ ఛాలెంజ్ ద్వారా ఒకేసారి 100 ఫెమ్టో ఉపగ్రహాలను ప్రయోగించడాన్ని ప్రస్తావిస్తూ... అంతరిక్ష పరిశోధనపై అవగాహన, ఆసక్తిని ప్రోత్సహించడంలో అబ్ధుల్ కలాం ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చేసిన కృషిని గవర్నర్ ప్రశంసించారు. పెలోడ్ క్యూబ్స్ ఛాలెంజ్‌లో భాగంగా సృష్టించిన ప్రపంచ రికార్డును ఆమె అభినందించారు.

  • APJMJ SHEIK DAWOOD nephew of dr APJ Abdul kalam& Mrs Nilofer Kurshid, Rtn Leema Rose & around 1000 students from various state schools participated pic.twitter.com/M9wT2KwVEY

    — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) February 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: పదేళ్లు నేనే ముఖ్యమంత్రి.. ఊహాగానాలపై కేసీఆర్ క్లారిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.