Independence Day Celebration 2023 Telangana : సిరిలిల్లలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి కేటీఆర్ పాల్గొని.. జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మన ఊరు- మనబడి పథకంలో భాగంగా పాఠశాలలు తీర్చిదిద్దామని మంత్రి పేర్కొన్నారు. జిల్లాలో 172 కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించామన్నారు. ఒకనాడు దగాపడిన పల్లెలు నేడు ధగధగలాడుతున్నాయని అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో రాష్ట్రానిదే సింహభాగమని మంత్రి కేటీఆర్ తెలిపారు.
Harish Rao Participated Independence Day Celebration : సిద్దిపేటలో నిర్వహించిన 77వ స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి హరీశ్ రావు పాల్గొని.. త్రివర్ణ పతకాన్ని ఎగరవేసి జాతీయ గీతాన్ని అలపించారు. మహబూబాబాద్ జిల్లాలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన 77వ స్వాతంత్ర్య దినోత్సవంలో మంత్రి సత్యవతి రాథోడ్(Satyavathi Rathode) పాల్గొని.. త్రివర్ణ పతకాన్ని ఎగురవేసి గౌరవ వందనాన్ని స్వీకరించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను అలరించారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖల ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శించారు.
Independence Day Celebration 2023 Mahabubnagar : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ ఫరేడ్ మైదానంలో 77వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్(Srinivas Goud) పాల్గొని.. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్ర ఘనతను కీర్తిస్తూ ప్రసంగించారు. అనంతరం స్వాతంత్ర్య సమర యోదులను, కుటుంబ సభ్యులను సత్కరించారు. ఉత్తమ సేవాలు కనబరిచిన పలువురు అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. పరేడ్ మైదానంలో నిర్వహించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి.
Errabelli Dayakar Participated Independence Day Celebration : జనగామ జిల్లా ధర్మకంచ మినీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో పంచాయత్ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు.. పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సముపార్జనలో పాల్గొన్న మహనీయులకు నివాళుర్పించారు. నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహిచిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎంపీ అర్వింద్ పాల్గొన్నారు. ఇతర నేతలతో కలిసి జాతీయ పతాకావిష్కరించారు.
Indrakaran Reddy Participated Independence Day Celebration : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. నిర్మల్ జిల్లాలోని మంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి జాతీయ జెండా ఎగరేసి.. జాతీయ గీతాన్ని ఆలపించారు. గడిచిన 77 సంవత్సరాల భారతదేశంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసుకోవడం జరిగిందన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఆదిలాబాద్‌లో ఎమ్మెల్యే జోగురామన్న భారీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎన్డీబీఎస్ ఐటీ కంపెనీ రూ.28లక్షలు వెచ్చించి నిర్మించిన 150 ఫీట్ల ఎత్తున్న జెండాపై జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేశారు.
'3Dతో అన్ని కలలు సాకారం.. 2047లో జెండా ఎగిరే నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్'
KTR on Independence Day Celebration : 'మన మున్సిపాలిటీలు, పట్టణాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి'