ETV Bharat / state

Independence Day 2023 Golconda Fort : గోల్కొండ కోటలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు - 77 వ స్వాతంత్య్ర దినోత్సవాలు

Independence Day 2023 Golconda Fort : ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవాలను గోల్కొండ కోటలో ఘనంగా నిర్వహించనున్నట్లు సీఎస్ శాంతికుమారి తెలిపారు. స్వాతంత్ర్య వేడుకల నిర్వహణ, ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖలు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశించారు. డీజీపీ అంజనీకుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

Golconda Fort
Independence Day 2023
author img

By

Published : Aug 9, 2023, 8:32 AM IST

Independence Day 2023 Golconda Fort : గత ఏడాది ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ (Azadi Ka Amrit Mahotsav) పేరిట స్వాతంత్య్ర సంబురాలు ఎంతో ఘనంగా నిర్వహించుకున్న సంగతి తెలిసిందే. ‘హర్‌ ఘర్‌ తిరంగా’ నినాదంతో ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. ఈ సంవత్సరం స్వాతంత్య్ర పర్వదినాన్ని మరింత కన్నులపండువగా నిర్వహించుకునేందుకు భారత్ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించే పనిలో తెలంగాణ ప్రభుత్వం నిమగ్నమయింది. ఏడున్నర దశాబ్దాలు దాటిన ప్రగతి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్న తరుణాన.. మరో సమున్నత ఆశయం హృది గదిలో ఉదయిస్తోంది.. ‘శతాబ్ది విజన్‌’ లక్ష్యం ప్రతి మదిలో నాటుకునేలా చేస్తోంది.

Independence Day Celebrations Telangana 2023 : ఇంకా అధిగమించాల్సిన సవాళ్లెన్నో.. అద్భుతమైన ప్రగతి బాటన పయనించేందుకు అవకాశాలెన్నో.. సమున్నత లక్ష్యమే నాందిగా నిలవాలనే సంకల్పం పెరుగుతోంది. 2047లో జరగనున్న శతాబ్ది వేడుకల నాటికి అన్నింటా అగ్ర పథమనే పరిస్థితులు దగ్గరవ్వాలి. రోజులో 24 గంటల తరుణమున్నట్లే.. వందేళ్ల భారతావని వేడుకల నాటికి ఇంకా 23 ఏళ్లే ఉన్నాయనేలా అడుగులు పడాలి. ఏడాదికి ఒక ఆశయాన్ని నెరవేర్చుకునే పరిస్థితులు దరిచేరాలి. ఈ తరహ విజన్‌తో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. 77వ స్వాతంత్య్ర దినోత్సవం(Independence Day Celebrations) సమీపిస్తున్న తరుణంలో సీఎస్ ఆ వేడుకలపై తాజాగా సమీక్ష జరిపారు.

నవంబర్‌ కల్లా టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ల రాత పరీక్షలన్నీ పూర్తి: సీఎస్

CS Review on Independence Day Celebrations in Telangana : స్వాతంత్య్ర దినోత్సవాలను చారిత్రాత్మక గోల్కొండ కోట(Golconda Fort)లో ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణ, ఏర్పాట్లపై మంగళవారం డా.బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆగస్టు 15వ తేదీన ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గోల్కొండ కోటలో(Independence Day Celebrations in Golconda Fort) జాతీయ పతాకావిష్కరణ చేస్తారని ప్రధాన కార్యదర్శి తెలిపారు.

అంతకుముందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో అమరవీరుల స్మారక స్తూపం వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తారని సీఎస్ శాంతికుమారి చెప్పారు. వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖలు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పోలీస్, ఆర్అండ్ బీ, సమాచార శాఖ, విద్యుత్, రవాణా తదితర శాఖలు, జీహెచ్ఎంసీ తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లోని వీరుల స్మారకం వద్ద... ఆర్మీ అధికారులతో కలిసి సమన్వయంతో తగు ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరికీ త్రివర్ణ పతాకం చెప్పే జీవితపాఠాలివే

77th Independence Day : ఈ సమావేశంలో డీజీపీ అంజనీకుమార్‌, మున్సిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్‌, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్‌.ఏ.ఎం.రిజ్వీ, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, రవాణాశాఖ కమిషనర్‌ జ్యోతి బుద్ధప్రకాష్‌, సమాచార శాఖ కమిషనర్‌ అశోక్‌రెడ్డి, సమాచార శాఖ డైరెక్టర్‌ రాజమౌళి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Appointment Orders For JPS In Telangana : జూనియర్ పంచాయతీరాజ్ కార్యదర్శుల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం ఆదేశాలు

CS Shanti Kumari Review on TS floods : 'వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా చూడండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.