ETV Bharat / state

తెలంగాణపై కరోనా పంజా... పెరుగుతున్న కేసులు

రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. పాజిటివ్​ కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. మరోవైపు దాదాపు నెలరోజుల తర్వాత జిల్లాల్లోనూ... పాజిటివ్​ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోన్న విషయం.

Increasing corona cases in telangana state
రాష్ట్రంలో కరోనా పంజా... పెరుగుతున్న కేసులు
author img

By

Published : May 27, 2020, 7:20 AM IST

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మంగళవారం ఒక్కరోజే రాష్ట్రంలో 71 కరోనా పాజిటివ్​ కేసులు నమోదైనట్టు వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. దీనితో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 1991 మంది ఈ మహమ్మారి బారినపడినట్టు పేర్కొంది. ఇక తాజాగా 120 మంది కోలుకుని గాంధీ నుంచి డిశ్చార్జ్​ కాగా.. ఇప్పటి వరకు 1284మంది పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్​ అయినట్లు వెల్లడించింది.

ప్రస్తుతం 650

ఇక మంగళవారం తాజాగా ఒకరు మృతి చెందగా... ఇప్పటివరకు 57 మంది చెందడం బాధాకరం. మరో 650మంది ప్రస్తుతం రాష్ట్రంలో చికిత్స పొందుతున్నారు. వీరిలో దాదాపు ఐదుగురు వెంటిలేటర్​పై ఉన్నట్టు సమాచారం. మరోవైపు గాంధీలో ప్లాస్మా థెరపీని సైతం ప్రయోగాత్మకంగా నిర్వహిస్తుండటం మెరుగైన ఫలితాలను ఇస్తున్నట్టు తెలుస్తోంది.

గాంధీలో అందిస్తున్న వైద్య సేవలపై మంత్రి రాజేందర్.. గాంధీ సూపరిండెంటెంట్​ సహా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సూచించారు.

నాలుగో విడత లాక్​డౌన్​ ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నప్పటికీ.. జీహెచ్​ఎంసీలోని కేసుల ఉద్ధృతి పెరుగుతోంది. అయితే దాదాపు నెలరోజుల తర్వాత రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కరోనా కేసులు నమోదవడం గమనార్హం.

మంగళవారం నమోదైన కేసుల వివరాలు ఇలా...

  • జీహెచ్​ఎంసీ-38
  • రంగారెడ్డి-7
  • మేడ్చల్​ -6
  • వలస కార్మికులు-12
  • విదేశాల నుంచి వచ్చినవారికి-4
  • సూర్యాపేట-1
  • వికారాబాద్​-1
  • నల్గొండ-1
  • నారాయణపేట-1

మంగళవారం నమోదైన కేసుల్లో 55 తెలంగాణకు చెందినవికాగా.. మిగతా 16 కేసులు ఇతర ప్రాంతాల వారివి కావడం గమనార్హం. గత కొంత కాలంగా వివిధ జిల్లాల్లో పాజిటివ్​ కేసులు నమోదుకాకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. జీహెచ్​ఎంసీ మినహా మిగతా ప్రాంతాల్లో లాక్​డౌన్​ను దాదాపు సడలించింది. అయితే పరిస్థితులు మాత్రం పూర్తి భిన్నంగా మారుతుడటం గమనార్హం.

దాదాపు నెల రోజుల తర్వాత జిల్లాల్లోనూ పాజిటివ్​ కేసులు నమోదుకావడం వల్ల వైద్యారోగ్య శాఖ కరోనా కట్టడికి మరిన్ని వ్యూహాలను సిద్ధం చేస్తోన్నట్లు తెలుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.

ఇదీ చదవండి: గొర్రెకుంట హత్యల నిందితునికి 14 రోజుల రిమాండ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.