ETV Bharat / state

కరోనా కాలంలోనూ.. ఆంధ్రాలో రాబడి పెరిగింది! - ఏపీలో పెరిగిన రాబడి

అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలు కరోనా కారణంగా చిన్నాభిన్నమైనా.. ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ రాబడి గతేడాదికి మించి నమోదైంది. కాగ్‌ తాజా విశ్లేషణను పరిశీలిస్తే ఇదే విషయం అవగతమవుతోంది.

increased-revenue-even-during-the-corona-period-in-andhra-pradesh
కరోనా కాలంలోనూ.. ఏపీలో పెరిగిన రాబడి
author img

By

Published : Jan 2, 2021, 1:23 PM IST

2020 నవంబరు నెలాఖరుకు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ వసూళ్లు రూ.66,708.47 కోట్లుగా కాగ్‌ లెక్కగట్టింది. 2019-20 ఆర్థిక సంవత్సంలో నవంబర్‌ మాసానికి వసూలైన రెవెన్యూ ఆదాయం రూ.63 వేల కోట్లు. నాటి బడ్జెట్‌ అంచనాల్లో అది కేవలం 35 శాతం కాగా.. ప్రస్తుత ఏడాది అంచనాల్లో 41 శాతం మేర సాధించారు.

increased-revenue-even-during-the-corona-period-in-andhra-pradesh
కరోనా కాలంలోనూ.. ఏపీలో పెరిగిన రాబడి

ఏపీకి కేంద్రప్రభుత్వం సాయంగా ఇచ్చే గ్రాంటుతో పాటు పన్నులు, పన్నేతర రూపాల్లో వచ్చే మొత్తాన్ని రెవెన్యూగా లెక్కిస్తారు. ఇందులో జీఎస్టీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం, అమ్మకపు పన్ను, కేంద్ర పన్నుల్లోని వాటా, భూమి పన్ను, ఎక్సైజ్‌ ఆదాయం తదితరాలు కలిపి ఉంటాయి. రుణాల ద్వారా సమకూరిన ఆదాయాన్ని రెవెన్యూగా పరిగణించరు. 2020 మార్చి చివరి వారం నుంచి 68 రోజుల పాటు దేశంలో లాక్‌డౌన్‌ విధించారు. ఆ తర్వాత కరోనా వ్యాప్తితో జనజీవనం స్తంభించడంతో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. ముఖ్యంగా అమ్మకపు పన్ను కొన్ని నెలల్లో రూ.100 కోట్ల కంటే తక్కువగా వచ్చింది. అయినా.. మొత్తంగా రెవెన్యూ పెరిగింది.

* ఏపీ బడ్జెట్‌ను అంచనాల మేరకు ఖర్చు చేయగలిగితేనే ప్రణాళిక బాగున్నట్లు పరిగణిస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2020 నవంబరు నాటికి రూ.1,40,198.88 కోట్లు ఖర్చు చేశారు. గతేడాదిలో 2019 నవంబరు ఆఖరు నాటికి రూ.93,629.21 కోట్లు వెచ్చించారు. అంటే.. కిందటి ఏడాది కంటే 66 శాతం అధికం.

* గత సంవత్సరంలో బడ్జెట్‌ అంచనాల్లో నవంబరు నాటికి 44 శాతం ఖర్చు చేయగా ఈ ఏడాది అది దాదాపు 67 శాతంగా నమోదైంది. ఖర్చులో పెట్టుబడి వ్యయం ఎంత ఎక్కువ ఉంటే అంత ప్రాయోజితంగా పరిగణిస్తారు. 2020 నవంబరు నాటికి పెట్టుబడి వ్యయం రూపంలో రూ.15,564.94 కోట్లు ఖర్చు చేశారు. 2019లో ఇదే కాలానికి పెట్టుబడి వ్యయం రూ.4,737.50 కోట్లు మాత్రమే.

అయినా అప్పుల తిప్పలే!

గత, ప్రస్తుత ఆర్థిక సంవత్సరాల్లో నవంబర్‌ వరకు కాలాన్ని పరిగణనలోకి తీసుకొని రెవెన్యూ వసూళ్ల మొత్తంగానీ, వసూళ్ల శాతాన్నిగానీ పోల్చినా.. 2020-21లో పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు స్థూలంగా అర్థమవుతోంది. బడ్జెట్‌ అంచనాల మేరకు రెవెన్యూ రాబడిలో పెరుగుదల కన్పిస్తోంది. అయినా.. ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది చేసిన అప్పు కిందటేడాది కంటే రెట్టింపునకు మించి ఉంది. 2019 ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు రూ.34,996.29 కోట్లు రుణం తీసుకోగా 2020 ఏప్రిల్‌-నవంబర్‌ మధ్య రూ.73,811.85 కోట్లు అప్పు చేసింది.

కాగ్‌ ఇటీవల ఇచ్చిన నివేదిక ప్రకారం.. ఏపీలో 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాల్లో నవంబరు నెలాఖరు వరకు ఏయే పద్దుల కింద ఎంత వెచ్చించారు? ఏయే రూపంలో ఎంత ఆదాయం వచ్చిందో పోల్చితే.. ఇలా ఉంది.

ఇదీ చదవండి: ఒకరి నుంచి 22మందికి కరోనా.. ఉలిక్కిపడ్డ సూర్యాపేట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.