Telangana Tourism Department: రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు దేశ, విదేశీ సందర్శకుల రాక పెరిగింది. తెలంగాణ ఆవిర్భావం నుంచి 2022 జులై వరకు 63.51 కోట్ల మంది దేశీయ పర్యాటకులు, 1.35 లక్షల మంది విదేశీ పర్యాటకులు ఇక్కడి వివిధ ప్రదేశాల్ని సందర్శించారని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ‘మన తెలంగాణ- మన సంస్కృతి- మన పర్యాటకం’ నినాదంతో పర్యాటకాన్ని సర్కారు ప్రోత్సహిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా 54 హరిత హోటళ్లు, వేసైడ్ వసతుల్ని కల్పించింది. 31 టూరిజం బస్సులు, జలాశయాల్లో 120 పడవలు అందుబాటులో ఉన్నాయి. ‘హైదరాబాద్‌తో పాటు నాగార్జునసాగర్, లక్నవరం, వరంగల్, తాడ్వాయి, బొగత జలపాతాలు, సోమశిల, సింగోటం రిజర్వాయర్లు, ఫర్హాబాద్ వ్యూ పాయింట్, అక్కమహాదేవి గుహలు, మల్లెలతీర్థం వంటి ప్రాంతాలు పర్యాటకుల్ని ఆకర్షిస్తున్నాయి’అని ఆ ప్రకటన వివరించింది.
ఇవీ చదవండి: