హైదరాబాద్ నగరంలో పేద ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్న బస్తీ దవాఖానాల సంఖ్యను 350కు పెంచాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. నగరంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న 118 బస్తీ దవాఖానాలు బాగా పనిచేస్తున్నాయన్నారు. ప్రజలు వాటితో ఎంతో సంతృప్తిగా ఉన్నారని ముఖ్యమంత్రి అన్నారు.
వాటి సంఖ్యను గణనీయంగా పెంచాలని సూచించారు. నగరంలోని 150 డివిజన్లలో ప్రతీ డివిజన్‌కు రెండు బస్తీ దవాఖానాలు ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, పేదలు నివసించే బస్తీలు, కాలనీల్లో మరిన్ని ఎక్కువ దవాఖానాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. రాబోయే నెలరోజుల్లోనే కొత్త బస్తీ దవాఖానాలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు.
ఇదీ చూడండి : హైదరాబాద్ యూనివర్సిటీలో ఉద్రిక్తత