ETV Bharat / state

మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న యువత - మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న యువత

హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌ పరిధిలో వారాంతంలో యువత మద్యం మత్తులో తూగుతోంది. పరిమితికి మించి మద్యం సేవించి ఎక్కువ మంది  వాహనాలు నడుపుతున్నట్లు సైబరాబాద్‌ పోలీసులు గుర్తించారు. శుక్ర, శనివారాల్లో నిర్వహించిన డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో పట్టుబడిన వారిలో ఎక్కువగా ఉన్నత విద్యావంతులు, ఐటీ ఉద్యోగులే ఉన్నారు.

increas-drunken-drive-cases-in-hyderabad
మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న యువత
author img

By

Published : Dec 2, 2019, 5:37 AM IST

Updated : Dec 2, 2019, 9:58 AM IST

మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న యువత

హైదరాబాద్‌లో డ్రంకన్‌ డ్రైవ్‌లో దొరుకుతున్న వారి సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. పోలీసులు పట్టుకుని.. కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తున్నా... వారాంతంలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ యువత ప్రమాదాలకు కారణమవుతోంది. నవంబరు 29, 30 తేదీల్లో సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో మందు బాబులు పెద్ద సంఖ్యలో పట్టుబడ్డారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ 345 మంది పట్టుబడగా.. అందులో 212 మంది ద్విచక్ర వాహనదారులు, 12 మంది ఆటోవాలాలు, 117 మంది కార్ల నడిపే వారు, 4 లారీ డ్రైవర్లు ఉన్నారు.

యువతే అధికం

అత్యధికంగా ఐటీ కంపెనీలు ఉన్న మాదాపూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో 92 మంది, గచ్చిబౌలిలో 60 మంది పట్టుబడ్డారు. వయసుల వారీగా తీసుకుంటే 21 నుంచి 30 ఏళ్లు కలిగిన వారు అత్యధికంగా 206 మంది కాగా... 31 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారు 86 మంది, 41 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న వారు 33 మంది ఉన్నారు.

అధిక మోతాదు

వృత్తుల వారీగా పరిశీలించిగా అత్యధికంగా 41 మంది ఐటీ ఉద్యోగులు, 40 మంది వ్యాపారులు, 33 మంది విద్యార్థులు, ఇతరులు 172 మంది ఉన్నట్లు సైబరాబాద్‌ పోలీసులు తెలిపారు. తాగిన మోతాదు తీసుకుంటే పరిమితికి మించి మద్యం సేవించిన మందుబాబులే అధికంగా ఉన్నారు. 50 పాయింట్లులోపు మోతాదు నమోదైన వారు 76 మంది ఉండగా, 50 నుంచి 100 పాయింట్లు నమోదైన వారు 160 మంది, 100 నుంచి 150 పాయింట్ల నమోదైన వారు 63 మంది, 151 నుంచి 200 పాయింట్ల మధ్య పట్టుబడిన వారు 27 మంది, 201 నుంచి 250 మధ్య పాయింట్లు నమోదైన వారు 10 మంది ఉన్నట్లు సీపీ సజ్జనార్​ తెలిపారు.

మద్యం మత్తులో వాహనాలు నడిపి పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఫలితం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చూడండి: పశువైద్యురాలి పేరు ఇకపై 'జస్టిస్‌ ఫర్‌ దిశ'

TG_Hyd_30_01_DRUNKEN_DRIVE_YOUTH_HIGH_PKG_3038066 Reporter: Tirupal Reddy Note: సైబరాబాద్‌ కమిషరేట్‌ పరిధిలో వాహనాలు తనిఖీ చేసిన ఫైల్‌ విజువల్స్‌ వాడుకోగలరు. ()హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌ పరిధిలో వారాంతంలో యువత మద్యం మత్తులో ఊగుతూ తూగుతోంది. పరిమితికి మించి మద్యం సేవించి ఎక్కువ మంది వాహనాలు నడుపుతున్నట్లు సైబారబాద్‌ పోలీసులు గుర్తించారు. శుక్ర, శనివారాలు రెండు రోజులు నిర్వహించిన డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో పట్టుబడిన వారిలో ఎక్కువగా ఉన్నతవిద్యావంతులు, ఐటీ ఉద్యోగులు ఉండడం విశేషం. LOOK వాయిస్ఓవర్‌1: హైదరాబాద్‌ నగరంలో డ్రంకన్‌ డ్రైవ్‌లో దొరుకుతున్న వారి సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. పోలీసులు పట్టుకుని..కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తున్నా...వారాంతరాల్లో యువత మద్యం మత్తులో జోగుతోంది. మద్యం తాగి వాహనాలు నడుపుతూ యువత ప్రమాదాలకు కారణమవుతోంది. నవంబరు 29, 30 తేదీల్లో రెండు రోజులపాటు సైబరాబాద్‌ కమిషన్‌రేట్‌ పరిధిలోని పది పోలీసు స్టేషన్ల పరిధిలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో మందు బాబులు పెద్ద సంఖ్యలో పట్టుబడ్డారు. మద్యం సేవించిన తరువాత వాహనాలు నడుతుపుతూ..మొత్తం 345 మంది మందుబాబులు పట్టుబడగా అందులో 212 మంది ద్విచక్ర వాహనదారులుకాగా, 12 మంది ఆటోవాలాలు, 117 మంది కార్లు నడుపుతూ దొరికారు. మరో నలుగురు మాత్రమ మద్యం మత్తులో లారీలు నడుపుతూ చిక్కారు. అత్యధికంగా ఐటీ కంపెనీలు ఉన్న మాదాపూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో 92 మంది, గచ్చిబౌలి స్టేషన్‌ పరిధిలో 60 మంది లెక్కన మందుబాబులు పట్టుబడ్డారు. వయస్సుల వారీగా తీసుకుంటే 21 నుంచి 30 సంవత్సరాలు లోపు వయస్సు కలిగిన వారు అత్యధికంగా 206 మంది, 31 నుంచి 40 సంవత్సరాల మద్య వయస్సు కలిగిన వారు 86 మంది, 41 నుంచి 50 ఏళ్ల మద్య వయస్సు ఉన్న వారు 33 మంది లెక్కన మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ దొరికినట్లు సైబారబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. వాయిస్ఓవర్‌2: తాగి పట్టుబడిన వారిలో వృత్తుల వారీగా పరిశీలించినట్లయితే...అత్యధికంగా 41 మంది లెక్కన ఐటీ ఉద్యోగులు, కార్మికులు ఉండగా వ్యాపారులు 40 మంది, విద్యార్ధులు 33 మంది, డ్రైవర్లు 18 మంది, ఇతరులు 154 మంది ఉన్నట్లు సైబరాబాద్‌ పోలీసులు తెలిపారు. మందుబాబులు తాగిన మోతాదు వారీగా తీసుకుంటే...పరిమితికి మించి మద్యం సేవించిన మందుబాబులే అధికంగా ఉన్నారు. యాభై పాయింట్లులోపు మోతాదు నమోదైన వారు 76 మంది ఉండగా, యాభై నుంచి వంద మద్య పాయింట్లు నమోదైన వారి సంఖ్య అత్యధికంగా 160 మంది పట్టుబడ్డారు. వంద నుంచి 150 పాయింట్ల మద్య మోతాదు కలిగిన పట్టుబడిన మందుబాబులు 63 మంది, 151 నుంచి 200 పాయింట్ల మద్య పట్టుబడిన వారి సంఖ్య 27 మంది, 2001 నుంచి 250 మద్య పాయింట్లు కలిగిన వారు పది మంది ఉన్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ తెలిపారు. వాయిస్ఓవర్‌3: వాహన తనిఖీల్లో అనేక విస్తుగొలిపే అంశాలు బయటకు వచ్చినట్లు సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ తెలిపారు. మద్యం మత్తులో వాహనాలు నడపడమే కాకుండా ప్రమాదకర వేగంతో వాహనాలను నడపడం...హెల్మెట్‌ ధరించకుండా ఉండడం...ముగ్గురితో ద్విచక్రవాహనం నడపడం లాంటి ఉల్లంఘనదారులే అధికంగా ఉన్నారని సైబారబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. రాబోవు రోజుల్లో డ్రంకన్‌ డ్రైవ్‌ కేసుల సంఖ్యను క్రమంగా తగ్గించేందుకు ప్రయత్నిస్తానని వరంగల్‌ సీపీ సజ్జనార్‌ ఆయన వివరించారు.
Last Updated : Dec 2, 2019, 9:58 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.