IN Vitro Fertility Center in Gandhi Hospital : పెళ్లి అయి సంవత్సరాలు గడిచినా.. పిల్లలు పుట్టక చాలా మంది ఆస్పత్రుల చూట్టూ తిరుగుతుంటారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.లక్షల్లో ఫీజు చెల్లించి.. పిల్లలు పుట్టేందుకు చికిత్స తీసుకుంటుంటారు. నగదు అంతగా లేనివారి పరిస్థితి అయోమయమే. అలాంటి వారి కోసమే రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా గాంధీ ఆసుపత్రిలో అధునాతన సంతాన సాఫల్య కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. గాంధీ ఆసుపత్రిలో తల్లీపిల్లల విభాగంలోని ఐదో అంతస్థులో ప్రత్యేకంగా ఈ సేవలను హోం మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఇకపై గాంధీ ఆసుపత్రిలో పైసా ఖర్చు లేకుండానే ఐవీఎఫ్ పద్ధతిలో సంతానం పొందే అవకాశముంది. రూ.5 కోట్లతో అత్యాధునిక ఐవీఎఫ్ చికిత్సలను అందుబాటులోకి తెచ్చినట్లు హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. ప్రైవేటులో రూ.లక్షల్లో ఖర్చయ్యే ఈ ప్రక్రియను గాంధీలో మాత్రం ఉచితంగా అందించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంలో తెలంగాణ వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని మహమూద్ అలీ తెలిపారు.
Parenting Center at Gandhi Hospital in Hyderabad : సంతానం కోసం ఆర్థికంగా స్థోమత లేకున్నా.. ఆస్పత్రుల చూట్టూ తిరుగుతూ రూ.లక్షల్లో ఖర్చు చేస్తుంటారు. ప్రైవేట్ క్లినిక్‌లలో ఐవీఎఫ్ కోసం ప్రయత్నిస్తుంటారు. ఇకపై గాంధీ ఆస్పత్రి(Gandhi Hospital)లోనే ఉచితంగా ఈ పద్దతిని పొందే అవకాశముంది. వాస్తవానికి 2018లోనే గాంధీలో సంతాన సాఫల్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. కేవలం టెస్టులు, కౌన్సెలింగ్‌తోపాటు ఇంట్రాయుటెరిన్ ఇన్సెమినేషన్ (ఐయూఐ) పద్ధతిలో సంతానం పొందేలా ప్రయత్నం చేసేవారు. ఈ పద్దతిలో భర్త నుంచి సేకరించిన వీర్యాన్ని ప్రయోగశాల్లో శుద్ది చేసి భార్య అండాశయంలోకి ప్రవేశపెడతారు. ఈ విధానంలో ఇప్పటికే కొందరికి సంతాన భాగ్యం దక్కింది. తాజాగా ప్రారంభం కానున్న కేంద్రంలో రూ.5 కోట్లతో అత్యాధునిక ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్(ఐవీఎఫ్) చికిత్సలను అందుబాటులోకి తెచ్చామని ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. ఈ ప్రక్రియలో ల్యాబ్‌లోనే పిండాన్ని ఫలదీకరణ చేయించి.. అనంతరం మహిళ గర్భంలో పెడతారు. ఐయూఐతో పోల్చితే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న చికిత్స. ప్రైవేటులో రూ.లక్షల్లో ఖర్చు అవుతుంది. గాంధీలో మాత్రం ఉచితంగా అందించనున్నారు.
గాంధీలో హెల్ప్‌డెస్క్.. బాధితుల పరిస్థితి తెలుసుకునే వెసులుబాటు
Free Recanalization surgery at Gandi Hospital : చాలా మంది దంపతులు ఒకరిద్దరు పిల్లలు పుట్టిన అనంతరం కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేసుకుంటున్నారు. దురదృష్టవశాత్తు ఏదైనా కారణాల వల్ల వారి పిల్లలు మరణిస్తే.. మళ్లీ సంతానం కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి జంటలకు కూడా గాంధీ ఆసుపత్రి భరోసా ఇస్తోంది. ఇక్కడి వైద్యులు రీకనలైజేషన్ శస్త్రచికిత్స(Recanalization surgery)లను విజయవంతంగా పూర్తి చేసి, మళ్లీ సంతాన భాగ్యం కల్పిస్తున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో ఇలాంటి సర్జరీలు చేశారు. ప్రస్తుతం ప్రైవేటులో రీకనలైజేషన్ కోసం రూ.2 లక్షల వరకు అవుతుంది. గాంధీలో ఉచితంగానే ఈ సేవలు పొందే వీలుంది.
Gandhi doctors: గాంధీ ఆస్పత్రి వైద్య సిబ్బందికి సత్కారం
'సొంత వైద్యం పనికి రాదు... అవసరమైతే డాక్టర్‌ను సంప్రదించండి'
Dr Raja Rao Interview : 'గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకే.. ఎంసీహెచ్ కేంద్రాలు'