ETV Bharat / state

రానున్న రోజుల్లో తెరాస కుటుంబ ఆస్తిగా మిగిలిపోనుంది : బండి - trs party office will remains as family asset

రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం కుటుంబ ఆస్తిగా మిగిలిపోనుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కేంద్రం పంపించే నిధులను దారి మళ్లించి జేబులు నింపుకుంటున్నారని మండిపడ్డారు.

రానున్న రోజుల్లో తెరాస కుటుంబ ఆస్తిగా మిగిలిపోనుంది : బండి సంజయ్

author img

By

Published : Aug 10, 2020, 1:45 PM IST

Updated : Aug 10, 2020, 4:01 PM IST

రానున్న రోజుల్లో తెరాస కార్యాలయం కుటుంబ ఆస్తిగా మిగిలిపోనుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ జోస్యం తెలిపారు. భాజపా కార్యాలయాలు మాత్రం దేశ భక్తులకు ఆశ్రయంగా మారుతున్నాయన్నారు. అమరవీరుల ఆశయ సాధనే లక్ష్యంగా భాజపా ముందుకెళ్తోందని స్పష్టం చేశారు.

అనేక క్లిష్ట సమస్యలను పరిష్కరించాం...

దేశంలో అనేక క్లిష్టమైన సమస్యలను భాజపా పరిష్కరించిందని సంజయ్ వెల్లడించారు. తెలంగాణలో ఏ ఒక్క వర్గానికి తెరాస ప్రభుత్వం న్యాయం చేయలేదని ఆయన మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం, రెండు పడక గదుల ఇళ్ల హామీని సైతం నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. కేంద్రం నిధులను దారిమళ్లించి జేబులు నింపుకుంటున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రానున్న రోజుల్లో తెరాస కుటుంబ ఆస్తిగా మిగిలిపోనుంది : బండి

ఇవీ చూడండి : మానేరులోకి చేపపిల్లలు.. వదిలిన మంత్రులు తలసాని, గంగుల

Last Updated : Aug 10, 2020, 4:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.