ప్రభుత్వం లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చినప్పటికీ ప్రజారవాణా ఆరంభం కానందున.. జిల్లాల నుంచి హైదరాబాద్‌లోని ఆసుపత్రులకు వచ్చి ఓపీ సేవలు పొందే రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. అయితే.. జిల్లా ఆసుపత్రుల్లోనూ ఓపీ సేవలు లభ్యమవుతుండడం దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు కాస్త ఊరటనిస్తోంది. కొవిడ్-19 నివారణకు ప్రత్యేక జాగ్రత్తల దృష్ట్యా కొన్ని కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులు ఓపీ సేవల రుసుములను స్వల్పంగా పెంచాయి. ఇది లాక్‌డౌన్ కారణంగా నెలలుగా ఉపాధిలేక అవస్థలు పడుతున్న ప్రజలకు ఇబ్బంది కలిగిస్తోంది.
ఆసుపత్రుల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కొన్నిచోట్ల రోగులు, సహాయకులు వ్యక్తిగత దూరాన్ని పాటించడంలో శ్రద్ధ చూపటం లేదని, ఇది ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.