నిరాడంబరంగా ఉండడానికి ఇష్టపడే పవన్ కల్యాణ్ ఇప్పుడు హరిద్వార్‌లోనూ అదే చేస్తున్నారు. సాదాసీదాగా ఉండే ఒక ఆశ్రమంలో ఆయన రెండు రోజులు ఉన్నారు. జనసేన అధినేత బస చేసిన ఆశ్రమం, అందులో ఆయన ఉంటున్న గదిని చూస్తే ఎవరైనా విస్మయం చెందాల్సిందే. ఒక కుర్చీ , ఒక మంచం మాత్రమే ఆ గదిలో ఉన్నాయి. ఇవాళ కూడా అక్కడే ఉంటారు. దీనికి సంబంధించిన ఫొటోలను జనసేన పార్టీ ట్వీట్ చేసింది.
గంగానది చెంత పవన్
పుణ్యక్షేత్రమైన రిషికేశ్‌లో పవిత్ర గంగా నదిని పవన్ శుక్రవారం సందర్శించారు. తొలుత రిషికేశ్‌లోని గంగా బ్యారేజ్ చేరుకుని అక్కడ గంగా నది ప్రవాహ ఝురిని, ఒరవడిని ఆసక్తిగా తిలకించారు. హిమాలయల్లో ఉద్భవించే గంగా నది అక్కడి నుంచి పరవళ్లు తొక్కుతూ రిషికేశ్కు చేరుకునే వైనాన్ని ప్రొఫెసర్ విక్రం సోని, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత రాజేంద్రసింగ్ వివరించారు. గంగా నీటిలో 42 రకాల ఔషద లక్షణాలు ఉన్నాయని వివరించారు. ప్రధాన కాలువ మార్గమంతా దట్టమైన అడవితో నిండి ఉంది. అటవీ మార్గం మధ్యలో చిల్లా అనే ప్రాంతంలో ఆగి కాసేపు గంగా కాలువ ఒడ్డున కూర్చుని తదేకంగా గంగను పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి హరిద్వార్ చేరుకుని సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మాత్రి ఆశ్రమానికి వెళ్లారు.
ఇవీ చూడండి: జిన్‌పింగ్ రెండోరోజు పర్యటన సాగనుంది ఇలా..