ETV Bharat / state

మెరుగు పడ్డ చమురు అమ్మకాలు.. కొన్ని రంగాలకు సడలింపులే కారణం - తెలంగాణలో చమురు అమ్మకాల తాజా వార్తలు

తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ అమ్మకాలు కాస్త తేరుకున్నాయి. లాక్‌డౌన్​ నుంచి కొన్ని రంగాలకు ఉన్న సడలింపులతో నిత్యావసర వస్తువుల రవాణా రాకపోకలతో వాహనాల సంఖ్య పెరిగింది. ఈ నెల 21 వరకు సాధారణంగా 8.24 కోట్ల లీటర్ల పెట్రోల్‌ అమ్ముడు పోవాల్సి ఉండగా 3.53 కోట్ల లీటర్ల విక్రయాలు జరిగాయి.

మెరుగు పడ్డ చమురు అమ్మకాలు
మెరుగు పడ్డ చమురు అమ్మకాలు
author img

By

Published : Apr 24, 2020, 12:51 PM IST

రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాలు కాస్త మెరుగుపడ్డాయి. లాక్‌డౌన్‌ నుంచి కొన్ని రంగాలకు సడలింపులు ఉన్నందున.. వాహనరాకపోకల సంఖ్య అధికమైంది. ప్రధానంగా వ్యవసాయ, దాని అనుబంధ రంగాలకు చెందిన నిత్యావసర సరకులైన కూరగాయలు, పండ్లు, పాలు వంటి వాటిని తరలించే వాహనాలు, అత్యవసర సేవలు అందించాల్సిన శాఖలకు చెందిన సిబ్బంది కార్యాలయాలకు హాజరుకావడం లాంటి వాటితో రోడ్లపైకి వచ్చే వాహనాల సంఖ్య పెరిగింది. దీంతో పెట్రోల్‌, డీజిల్‌ వాడకం కూడా పెరిగింది. ఈ నెల ఒకటి నుంచి 21 వరకు జరిగిన విక్రయాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది.

మొదటి వారంలో దాదాపు 33శాతం పెట్రోల్‌, 34శాతం డీజిల్‌ అమ్మకాలు జరగగా... రెండో వారం 35 శాతానికిపైగా పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాలు జరిగనట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దాదాపు 43శాతం పెట్రోల్‌, 44శాతం డీజిల్‌ అమ్మకాలు సాగినట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. ఈ నెల 21 వరకు సాధారణంగా 8.24 కోట్ల లీటర్ల పెట్రోల్‌ అమ్ముడు పోవాల్సి ఉండగా 3.53 కోట్ల లీటర్ల విక్రయాలు జరిగాయి. అదే విధంగా 16.21 కోట్లు లీటర్లు డీజిల్‌ అమ్మకాలు జరగాల్సి ఉండగా 7.19 కోట్లు లీటర్లు విక్రయాలు జరిగినట్లు చమురు సంస్థలు లెక్కలు వెల్లడించాయి.

ఇదీ చదవండి : కన్నవారి చివరి ఘడియలు.. కూతుళ్లే దిక్కయ్యారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.