ఆషాఢ బోనాల జాతర సందర్భంగా హైదరాబాద్ పార్శిగుట్టలోని మధురానగర్ కాలనీలో గల శ్రీ బంగారు మైసమ్మ అమ్మవారు బంగారు కవచంలో కొలువుదీరారు. స్వర్ణపు కవచంతో దర్శనమిస్తున్న మైసమ్మ.. అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని చూసేందుకు భక్తులు ఆసక్తి కనబరుస్తున్నారు.
కరోనా వైరస్ నేపథ్యంలో బోనాల పండగ ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రభుత్వ సూచన మేరకు ఎవరి ఇళ్లలో వారు ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు.