Yuktha Vaishnavi Kuchipudi Debut: దిల్లీలోని కమని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ప్రముఖ నృత్యగురువులు రాజా రాధా రెడ్డి, కౌశల్యా రెడ్డిల శిష్యురాలు యుక్తా వైష్ణవి కూచిపూడి అరంగేట్రం ఆద్యంతం ఆకట్టుకుంది. గణపతి వందనంతో శుభారంభం చేసి, వివిధ అంశాలను కూచిపూడి శైలిలో నర్తించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది యుక్తా వైష్ణవి. ఈ కార్యక్రమంలో కిరణ్ నాడర్ మ్యూజియం స్థాపకులు కిరణ్ నాడర్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని యుక్తా వైష్ణవిని అభినందించారు. ఈ యువకళాకారిణి చిన్నప్పటి నుంచే ఎంతో ప్రావీణ్యం సాధించి, చక్కటి అభినయంతో ఆకట్టుకుని ప్రముఖుల మెప్పు పొందింది.
సంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన యుక్తా వైష్ణవి... చిన్నప్పుడే కూచిపూడి నాట్యం నేర్చుకోవాలని కాలికి గజ్జె కట్టింది. ప్రముఖ గరువులు రాజా రాధా రెడ్డి, కౌశల్యా రెడ్డిల వద్ద కఠోర శిక్షణతో ఎన్నో పాఠాలు నేర్చుకుంది. నేడు దిల్లీలో తన అభినయంతో ఆద్యంతం ఆకట్టుకునేలా కూచిపూడిలో రంగప్రవేశం చేసింది. గురువులు రాజా రాధా రెడ్డి, కౌశల్య రెడ్డి నాట్య తరంగిణి ఆమె ఈ గొప్ప కళారూపాన్ని 13 సంవత్సరాలుగా అధ్యయనం చేశారు. గతంలో యుక్త నాట్య తరంగిణి బృందంతో కలిసి పరంపర సిరీస్, పాటియాలా హెరిటేజ్ ఫెస్టివల్ 2020, యూత్ ఫెస్టివల్ 2016, టీటీడీ ఆలయ బ్రహ్మోత్వం వేడుకలు, ఆంధ్రా అసోసియేషన్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, నాట్య తరంగిణి వార్శిక ప్రదర్శనలు వంటి అనేక కార్యక్రమాలలో ప్రదర్శించారు.
వైష్ణవి ఇండియన్ స్కూల్ ఆఫ్ హాస్పిటాలిటీలో పాక కళలను అభ్యసించింది. మిచెలిన్ స్టార్ చెఫ్ కావాలన్నది ఆమె కల. కరోనా మహమ్మారి సమయంలో ఆమె ఒక సంవత్సరం పాటు క్లౌడ్ టేకరీని కూడా నడిపింది. ఆమె గత 11న దిల్లీలో జరిగిన రంగప్రవేశం వేసి కూచిపూడి నృత్యకారిణిగా మరో మెట్టు అధిరోహించింది.
ఇవీ చదవండి: