Impact of Smartphone Usage in Children : మన దగ్గర స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. ప్రపంచం మన చేతిలో ఉన్నట్లే. ఇంటర్‌నెట్ అందుబాటులోకి వచ్చాక ప్రపంచం కుగ్రామంగా మారిపోయింది. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా స్మార్ట్‌ఫోన్స్ రాకతో.. అన్ని రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. వీటివల్ల లాభాలున్నాయి. అలాగే నష్టాలు కూడా ఉన్నాయి. మరి ముఖ్యంగా పిల్లలలో తీవ్ర ప్రభావం చూపుతోంది.
Kalti ice cream in Hyderabad : మీ పిల్లలు తింటోంది ఐస్‌క్రీమా లేక చల్లని విషమా..?
Harms of Smartphone Usage in Kids : ముఖ్యంగా నేడు రకరకాల వీడియో గేమ్స్ పిల్లలను, పెద్దలను వాటి గారడీలో పడేస్తూ ఓ ఆట ఆడిస్తున్నాయి. వారి భవితపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీటికి పూర్తిగా బానిస కావడం వల్ల పిల్లలలో మానసిక ఎదుగుదల లోపిస్తోంది. స్మార్ట్ఫోన్లను తరచుగా వినియోగించడం వల్ల.. పిల్లలు చదువుపై దృష్టి సారించడంలేదని, భార్యా భర్తల మధ్య గొడవలు సంభవిస్తున్నాయని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు.
విమల్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థి గత కొంతకాలంగా తరచుగా గాల్లో ఎగురుతూ, గోడల మీది నుంచి దూకుతూ ఇంట్లో వింత ప్రవర్తనలతో భయాందోళనలు కలిగిస్తున్నాడు. అప్రమత్తమైన తల్లిదండ్రులు వెంటనే పట్టణంలోని.. ఓ ఆస్పత్రిలో వైద్యుడికి చూపించారు. కానీ ఆ బాలుడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. పిల్లవాడిని కొద్ది రోజులు ఇంట్లోనే.. ఒంటరిగా ఉంచి రహస్యంగా గమనించడం మొదలు పెట్టారు. రోజంతా స్మార్ట్‌ఫోన్‌లోనే గడుపుతూ ఉండటాన్ని గమనించారు. ‘బ్లూవేల్’ అనే వీడియోగేమ్ అతడిని ఆ చేష్టలకు ప్రేరేపిస్తున్నట్లు గుర్తించి విస్తుపోయారు.
మీ పిల్లలు ఫోన్లో ఏం చూస్తున్నారో తెలుసుకోవాలా..? అయితే ఇలా చేయండి
Smartphone Addiction in Children : హైదరాబాద్‌కు చెందిన ఓ బాలిక పదోతరగతి చదువుతోంది. ఇంట్లో ఉన్నంత సేపు స్మార్ట్‌ఫోన్‌లో కార్టూన్లు, వీడియో గేమ్‌లు చూసేందుకే పరిమితం అవుతోంది. దీంతో చదువుల్లో వెనుకబడిపోయి.. పరీక్షల్లో మార్కులు తగ్గిపోయాయి. తీరా.. ఆరా తీస్తే కొంత కాలంగా స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువగా వినియోగిస్తోందని.. స్నేహితులతో కార్టూన్ వీడియోల పాత్రలు, వీడియో గేమ్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతోందని తేలింది.
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేసే యువకుడు.. నిత్యం వికారాబాద్ నుంచి భాగ్యనగరంకు రైల్లో రాకపోకలు సాగిస్తాడు. ఈ క్రమంలో రైల్లో ప్రయాణిస్తుండగా స్మార్ట్‌ఫోన్‌లో వీడియో గేమ్స్‌లో లీనమయ్యాడు. తను దిగాల్సిన స్టేజీని గమనించక పోవడంతో.. రైలు చివరి స్టేజీ కర్ణాటకలోని రాయచూర్‌లో దిగాల్సి వచ్చింది.
Psychiatrist Advices on Smartphone Addiction : పిల్లలకు అస్తమానం ఫోన్లు ఇవ్వడం మంచిది కాదు. స్మార్ట్‌ఫోన్ వాడకం మద్యపానం కంటే ప్రమాదకరం. ఇంటర్ పూర్తయ్యే వరకు స్మార్ట్‌ఫోన్ కొనివ్వాల్సిన పనిలేదు. ఒకవేళ తప్పనిసరిగా స్మార్ట్‌ఫోన్ ఇవ్వాల్సిన పరిస్థతి తలెత్తితే కుటుంబసభ్యులు, తల్లిదండ్రుల సమక్షంలో ఉపయోగించుకునేలా చేయాలి. క్లాస్‌రూం ప్రాజెక్టు వర్కుల పేరుతో ఫోన్ తీసుకొని వీడియోగేమ్‌లు ఆడుతూ, అశ్లీల చిత్రాల బారిన పడి దారితప్పుతున్నారు. ప్రాజెక్టు వర్కుకు ఏం కావాలో మనమే సమకూర్చాలి. - సేవక్‌కుమార్, మానసిక, వ్యక్తిత్వ వికాస నిపుణులు
మీ పిల్లలు జంక్ ఫుడ్ బాగా తింటున్నారా?.. ఇవి పాటిస్తే సేఫ్.. లేదంటే..!