రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇదే సమయంలో గంటకు 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
ముఖ్యంగా ఉత్తర, మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఈ ప్రభావం ఉంటుందని పేర్కొంది. ఎల్లుండి కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశాలున్నాయని ఐఎండీ సంచాలకులు తెలిపారు. కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల నుంచి దక్షిణ కేరళ వరకు సముద్రమట్టానికి 0.9కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడిందని వివరించారు.
ఇదీ చూడండి: భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం