ETV Bharat / state

WEATHER REPORT: రాగల మూడురోజులు విస్తారంగా వర్షాలు

author img

By

Published : Jul 20, 2021, 1:11 PM IST

రాష్ట్రంలో ఇవాళ, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడని వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని... కొన్ని చోట్ల భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

imd-released-state-weather-report
రాగల మూడ్రోజుల విస్తారంగా వర్షాలు

తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రేపు భారీ వర్షాలు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు - పశ్చిమ ద్రోణి/షేర్ జోన్ ఈ రోజు సుమారు 18°N అక్షాంశం వెంబడి సముద్ర మట్టానికి 4.5 కిలో మీటర్ల నుంచి 5.8 కిలో మీటర్ల మధ్య కొనసాగుతూ.... ఎత్తుకి వెళ్ళే కొలదీ దక్షిణ వైపుకి వంపు తిరిగి ఉన్నదని పేర్కొంది. ఈ నెల 23న వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది.

దంచికొడుతున్న వానలు...

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వారం రోజులుగా రాష్ట్రంలో వానలు దంచికొడుతున్నాయి. పలు చోట్ల రహదారులు కొట్టుకుపోగా... వంతెనలు తెగాయి. చెరువు కుంటలు మత్తడి దుంకుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వ్యవసాయ క్షేత్రాలను వరద ముంచెత్తింది. ఇటీవల నాట్లేసిన వరి చేలు, మొక్కజొన్న, కంది, కూరగాయ పంటలు నీట మునిగాయి. కొన్ని ప్రాంతాల్లో ఆయా గ్రామాల మధ్య రోడ్డుపై ఉన్న లోతట్టు వంతెనలు మునిగిపోవడంతో రాకపోకలు నిలచిపోయాయి. పలుచోట్ల అప్రోచ్‌ రహదారులు వరద ఉద్ధృతికి తెగిపోవడంతో జనజీవనానికి ఆటంకం కలిగింది. కొన్ని చోట్ల విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి.

ఇబ్బంది పడుతున్న వాహనదారులు...

హైదరాబాద్​లోని ​పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వివిధ పనుల నిమిత్తం బయటికొచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారులపై నీరు నిలిచి వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. భారీ వర్షం కారణంగా రహదారులపైకి నీరు చేరింది. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. జీహెచ్​ఎంసీ సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చిన వాహనదారులు గమ్యస్థానాలకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు ప్రాంతాల్లో విద్యుత్​కు అంతరాయం కలుగుతోంది. వర్షాలు విస్తారంగా కురిసే అవకాశమున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి: Weather Report: ఇవాళ, రేపు భారీ వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.