పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఈ ఉపరితల ఆవర్తనం మరో 36 గంటల్లో అల్పపీడనంగా మారి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటున్న వాతావరణ శాఖ అధికారి రాజారావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇవీ చూడండి: 'స్వచ్ఛభారత్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి'