ETV Bharat / state

Rains in Telangana: రాష్ట్రంలో రాగల మూడ్రోజులు.. మోస్తరు వర్షాలు - తెలంగాణ వార్తలు

రాష్ట్రంలో రాగల మూజు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Rains in Telangana) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(IMD HYDERABAD) వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని తెలిపింది. ఉపరితల ద్రోణి రాజస్థాన్ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా శ్రీలంక తీరం వరకు కొనసాగుతుందని పేర్కొంది.

Rains in Telangana, telangana weather report
రాష్ట్రంలో వర్షాలు, తెలంగాణ వాతావరణ నివేదిక
author img

By

Published : Aug 21, 2021, 6:51 PM IST

రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(Rains in Telangana) కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(IMD HYDERABAD) ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో(TS WEATHER REPORT) పేర్కొన్నారు. ఉపరితల ద్రోణి శనివారం నాడు రాజస్థాన్ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా శ్రీలంక తీరం వరకు సముద్రమట్టానికి 1.5కి.మీ ఎత్తు వద్ద కొనసాగుతుందని వివరించారు. ఉపరితల ఆవర్తనం మరఠ్వాడ పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 3.1కిమీ ఎత్తు వద్ద కేంద్రీకృతమై ఉందని సంచాలకులు తెలిపారు.

ఏపీలో వానలు

మహారాష్ట్రలోని విదర్భతో పాటు.. పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకూ 3.1 కిలోమీటర్ల ఎత్తున ఆవరించి ఉన్నట్లు.. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు(rains in ap) కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఏపీలోని తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో.. ఒకటీ రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే రెండు, మూడు రోజుల్లో.. రాయలసీమలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. వచ్చేవారం రోజుల పాటు.. కోస్తాంధ్రలో సాధారణం కంటే అధిక వర్షపాతం కురిసే సూచనలు ఉన్నాయని అంచనా వేసింది.

ఇదీ చదవండి: Weather today: కుండపోత వర్షం.. రోడ్లన్నీ జలమయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.