రాష్ట్రంలో ఇవాళ, రేపు ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో ఉదయం వేళల్లో తేలికపాటి పొగమంచు కురిసే అవకాశలున్నాయని పేర్కొంది.
మంగళవారం ఏర్పడిన అల్పపీడన ద్రోణి విస్తరించి, దక్షిణ అరేబియన్ సముద్రం.. దానిని ఆనుకొని ఉన్న కొంకణి- గోవా మీదుగా ఉత్తర మధ్య మహారాష్ట్ర 0.9 కి.మీ ఎత్తువరకు విస్తరించినట్లు వాతావరణ కేంద్ర సంచాలకులు వెల్లడించారు.
దక్షిణ శ్రీలంక తీరం నుంచి ఆంధ్రప్రదేశ్ ఉత్తర తీరం వరకు క్రింది స్థాయి తూర్పు గాలులలో 1.5 కి.మీ వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి... ఇవాళ కోమరిన్ ప్రాంతం నుంచి మన్నార్ గల్ఫ్ మీదుగా ఉత్తర తమిళనాడు వరకు 0.9 కి.మీ వరకు విస్తరించిందని పేర్కొన్నారు.
ఇవీచూడండి: భూమా అఖిలప్రియను ప్రశ్నిస్తున్న పోలీసులు.. పరారీలో ఆమె భర్త