ETV Bharat / state

కల్తీ మద్యం... భూమిలో పాతరేసి భారీగా నిల్వ - గుంటూరులో అక్రమ మద్యం వార్తలు

పొరుగు రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకు పెద్దఎత్తున మద్యం సీసాలు ఆంధ్రప్రదేశ్​లోకి తరలిస్తుండగా...ఇప్పుడు ఏకంగా కల్తీమద్యమే ఏరులైపారుతోంది. పల్నాడులో నకిలీ మద్యం నిల్వల గుట్టురట్టయ్యింది. భూమిలో నిల్వచేసిన భారీ నకిలీ మద్యాన్ని అధికారులు పట్టుకున్నారు. కర్ణాటకలోని బెల్గాంలో నాటు పద్ధతుల్లో తయారు చేసిన ఇక్కడి తరలించి విక్రయిస్తున్నట్లు తెలిసింది.

illegal
కల్తీ మద్యం...భూమిలో పాతరేసి భారీగా నిల్వ
author img

By

Published : Nov 30, 2020, 12:29 PM IST

కల్తీ మద్యం...భూమిలో పాతరేసి భారీగా నిల్వ

మద్యనిషేధానికి దశలవారీగా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తున్న వేళ మిగతా రాష్ట్రాల నుంచి పన్ను చెల్లించని అక్రమమద్యం గుంటూరు జిల్లాలో పెద్దఎత్తున ప్రవహిస్తోంది. సరిహద్దు ప్రాంతాల నుంచి రోడ్డు, జల మార్గంలో మద్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. వాషింగ్‌ మెషీన్లలోనూ, ఇసుక లారీల్లోనూ... భారీగా తరలిస్తున్న మద్యంను గుర్తించిన పోలీసులు... ఇది గోవా నుంచి కర్ణాటక మీదుగా తరలిస్తున్నట్లు తేల్చారు. ఈ సమాచారంతో జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహించిన సెబ్‌ అధికారులు .. భారీగా కల్తీ మద్యం నిల్వలు గుర్తించారు. వెల్దుర్తి మండలం ఉప్పలపాడు, గుండ్లపాడులో భూమిలో నిల్వచేసిన 37 లక్షల విలువైన కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకుని దాదాపు 19 మంది నిందితులను అరెస్టు చేశారు. కర్ణాటకలోని బెల్గాం కేంద్రంగా పేరున్న కంపెనీల లేబుళ్లతో కల్తీ మద్యం తయారవుతోందని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో గుంటూరు జిల్లా ఉప్పలపాడు, గుండ్లపాడుకు చెందిన 12 మంది, తెలంగాణకు చెందిన ముగ్గురు, మధ్యప్రదేశ్ నుంచి ఇద్దరు, కర్ణాటక నుంచి ఒకరు అరెస్టయ్యారు. సరిహద్దుల్లో నిఘా కొనసాగుతోందని, నిరంతర పర్యవేక్షణ ద్వారానే అక్రమ మద్యం రవాణా, కల్తీ మద్యంను నివారించగలమని అధికారులు తెలిపారు.

ఏపీ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పేరున్న బ్రాండ్ల మద్యం లభించకపోవడం, ఎక్కువగా కొత్త బ్రాండ్లే లభించడంతో అక్రమ మద్యానికి గిరాకీ పెరిగింది. మిగతా రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున పట్టుబడుతున్న మద్యం నిల్వల్లో పేరున్న పాత బ్రాండ్లవే 80 నుంచి 90 శాతం ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించామని అధికారులు తెలిపారు. అక్రమ, కల్తీ మద్యాన్ని అడ్డుకునేందుకు విస్తృతంగా దాడులు చేస్తామని పోలీసు, సెబ్ అధికారులు స్పష్టం చేశారు.

ఇవీచూడండి: పోలింగ్ కేంద్రాల్లో నిరంతర నిఘా.. ప్రచారం చేస్తే రెండేళ్లు జైలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.