ETV Bharat / state

కొలువుల పంచాయితీ.. అక్రమంగా జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల నియామకం! - Illegal Job Postings

Illegal Job Postings:ఓ వైపు రాష్ట్రప్రభుత్వం రెగ్యులర్‌ విధానంలో దాదాపు 80 వేల పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తుండగానే.. మరోవైపు జిల్లా స్థాయిలో అక్రమ నియామకాలు జరుగుతున్నాయి. రెగ్యులర్‌ జేపీఎస్‌ల నియామక ప్రక్రియ ముగిసి దాదాపు మూడున్నరేళ్లు అవుతున్నా.. ఆ పరీక్ష మెరిట్‌ లిస్టు పేరిట ఇప్పటికీ పొరుగుసేవల కింద పోస్టింగులు ఇస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఆదేశాలు జారీ అవుతున్నాయి. రాష్ట్రంలో అత్యధిక జిల్లాల్లో ఈ తరహా నియామకాల ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది.

illegal job postings in telangana state
illegal job postings in telangana state
author img

By

Published : Jul 26, 2022, 4:15 AM IST

Illegal Job Postings: నిబంధనలకు విరుద్ధంగా పంచాయతీరాజ్‌ శాఖ జూనియర్‌ పంచాయతీ కార్యదర్శు(జేపీఎస్‌)ల నియామకాలకు తెరలేపింది. ప్రైవేటు ఏజెన్సీల ద్వారా పొరుగుసేవల కింద నియమించుకున్న వారికి అక్రమంగా రెగ్యులర్‌ పోస్టింగులిస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఓ వైపు రాష్ట్రప్రభుత్వం రెగ్యులర్‌ విధానంలో దాదాపు 80 వేల పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తుండగానే.. మరోవైపు జిల్లా స్థాయిలో అక్రమ నియామకాలు జరుగుతున్నాయి. రెగ్యులర్‌ జేపీఎస్‌ల నియామక ప్రక్రియ ముగిసి దాదాపు మూడున్నరేళ్లు అవుతున్నా.. ఆ పరీక్ష మెరిట్‌ లిస్టు పేరిట ఇప్పటికీ పొరుగుసేవల కింద పోస్టింగులు ఇస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఆదేశాలు జారీ అవుతున్నాయి. రాష్ట్రంలో అత్యధిక జిల్లాల్లో ఈ తరహా నియామకాల ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతూ జరుగుతున్న ఈ ప్రక్రియపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నిబంధనలకు విరుద్ధంగా..
రాష్ట్రపతి నూతన నిబంధనలు అమల్లోకి వచ్చాక తొలి నియామక ప్రకటన పంచాయతీరాజ్‌ శాఖలోనే వెలువడింది. మొత్తం 9,355 జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి 2018లో ఉద్యోగ ప్రకటన వెలువడగా.. రాతపరీక్ష నిర్వహించి మెరిట్‌ లిస్టు ప్రకారం 2019 ఏప్రిల్‌లో నియామకాలు చేపట్టారు. మూడేళ్లపాటు ఒప్పంద పద్ధతిలో పనిచేశాక గ్రేడ్‌-4 పంచాయతీ కార్యదర్శిగా క్రమబద్ధీకరిస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఇందులో పనిభారం, ఇతర ఉన్నత పోస్టులు రావడం తదితర కారణాలతో దాదాపు 2 వేల మంది వరకు ఉద్యోగాలను వదిలిపెట్టారు. ఈ ఖాళీలను నిబంధనల ప్రకారం బ్యాక్‌లాగ్‌గా ప్రకటించి.. తదుపరి నియామక ప్రకటన కింద భర్తీ చేయాలి. ఒకవేళ వెంటనే నియామకాలు చేపట్టినప్పటికీ తాత్కాలిక పద్ధతిలో ఉండాలి. కానీ, ఈ నిబంధనలన్నింటినీ పంచాయతీరాజ్‌ శాఖ ఉల్లంఘించింది.

బ్యాక్‌లాగ్‌గా గుర్తించని వైనం..
2019లో జేపీఎస్‌ ఉద్యోగంలో చేరిన కొందరు మానేసినా.. ఆయా బాధ్యతలను పొరుగు గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులకు అప్పగించలేదు. జిల్లాల వారీగా తదుపరి మెరిట్‌ అంటూ అభ్యర్థులను పిలిచి పొరుగుసేవలు, అడ్‌హక్‌ కార్యదర్శుల పేరిట ఉద్యోగాలిచ్చారు. రెగ్యులర్‌ పోస్టు భర్తీ అయ్యేంత వరకే ఈ ఉద్యోగం ఉంటుందని తొలుత నియామక పత్రాల్లో పేర్కొన్నా.. కొన్ని నెలలు గడిచిన వెంటనే వారికి రెగ్యులర్‌ జేపీఎస్‌లుగా కలెక్టర్లు పోస్టింగులిచ్చారు. బ్యాక్‌లాగ్‌ ఖాళీలుగా ఉండాల్సిన కొలువులు నిబంధనలకు విరుద్ధంగా భర్తీచేయడంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కొన్నిచోట్ల రాజకీయ జోక్యంతో ఈ నియామక ఆదేశాలు జారీ అవుతున్నాయి. ఒక్కో పోస్టుకు భారీగా నగదు చేతులు మారుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇలాంటి నియామకాలతో న్యాయపరమైన వివాదాలు వస్తాయని, నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుందని క్షేత్రస్థాయి అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా.. లాభం లేకపోయింది. పొరుగుసేవల కింద నియమితులైన వారిని రెగ్యులర్‌ జేపీఎస్‌లుగా సర్వీసును మార్చడంపై పంచాయతీరాజ్‌ ఉన్నతాధికారులను సంప్రదించగా.. ఆదేశాలను పరిశీలిస్తామని తెలిపారు.

ఇవిగో ఉదంతాలు..

  • ఖమ్మం జిల్లాలో పొరుగుసేవలు, అడ్‌హక్‌ పంచాయతీ కార్యదర్శులుగా నియమితులైన 76మందిని రెగ్యులర్‌ జేపీఎస్‌లుగా మారుస్తూ 2021 సెప్టెంబరు 1న ఆదేశాలు జారీ చేశారు.
  • నల్గొండ జిల్లాలో పలువురు పొరుగుసేవల జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల్ని రెగ్యులర్‌ జేపీఎస్‌లుగా మార్చుతూ 2022 మార్చి 4న ఆదేశాలు వెలువడ్డాయి. జోగులాంబ గద్వాలలోనూ ఇదే పద్ధతిలో రెగ్యులర్‌ జేపీఎస్‌లుగా నియమించారు.
  • జగిత్యాల జిల్లాలో కరీంనగర్‌కు చెందిన వారధి సొసైటీ ద్వారా నియమితులైన ఐదుగురు పొరుగుసేవల జేపీఎస్‌లను 2021 అక్టోబరు 28న రెగ్యులర్‌ కిందకు మార్చారు.
  • మంచిర్యాల జిల్లా శ్రీసాయి యూత్‌ అసోసియేషన్‌ ఏజెన్సీ ద్వారా ఎంపికైన పొరుగు సేవల జేపీఎస్‌లను 2022 జనవరి 31న రెగ్యులర్‌ చేశారు.
  • సిరిసిల్ల జిల్లాలో అడ్‌హక్‌ జేపీఎస్‌లుగా నియమితులైన ఎనిమిది మందిని రెగ్యులర్‌ జేపీఎస్‌లుగా మార్చి వేరే గ్రామాలకు బదిలీ చేసేందుకు వీలుగా ఆదేశాలు ఇచ్చారు.

ఇదీ చదవండి: దయచేసి వారిని రాజకీయాల్లోకి లాగొద్దు: కేటీఆర్ విజ్ఞప్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.