ETV Bharat / state

అంతులేని అక్రమ నిర్మాణాలు... లాక్‌డౌన్‌ కాలంలో జోరుగా పనులు! - లాక్​డౌన్ సమయంలో హైదరాబాద్​లో అక్రమ నిర్మాణాలు

కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటిస్తే.. అదే అదనుగా అక్రమార్కులు హైదరాబాద్​లో భవంతులు నిర్మించారు. ప్రభుత్వ భూముల్లో భారీ నిర్మాణాలు చేపట్టారు. యూఎల్‌సీ భూములు, వివాదాస్పద స్థలాలు, చెరువులు అందుకు వేదికలయ్యాయి. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ నుంచి లింగంపల్లి వరకు, ఎల్బీనగర్‌ చుట్టుపక్కల, చార్మినార్‌ జోన్‌లో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. అధికారులు నిఘా ఉంచి, కట్టడి చేయకపోతే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి.

illegal constructions
illegal constructions
author img

By

Published : Jul 14, 2020, 1:20 PM IST

హైదరాబాద్‌ నగరంలో 20 లక్షలకుపైగా నిర్మాణాలుంటే.. అందులో 15 లక్షలు ఆస్తిపన్నుల జాబితాలో, 1.2 లక్షలు బీఆర్‌ఎస్‌(భవన నిర్మాణాల క్రమబద్ధీకరణ పథకం) కింద దరఖాస్తు చేసుకున్న విభాగంలో ఉన్నాయి. మిగిలినవన్నీ అక్రమ నిర్మాణాలే. బీఆర్‌ఎస్‌ నోటిఫికేషన్‌ అనంతరం నిర్మించినవి. లాక్‌డౌన్‌ కాలంలో ప్రభుత్వ భూములు, వివాదాస్పద స్థలాలు, చెరువులు, లేఅవుట్‌ ఖాళీ స్థలాల్లో పెద్దఎత్తున నిర్మాణాలు జరిగాయి. మంత్రి కేటీఆర్‌ సైతం ఆ విషయమై అధికారులను ప్రశ్నించారు. లింకు రోడ్ల నిర్మాణ పనుల తనిఖీల్లో భాగంగా నెల క్రితం షేక్‌పేట, ఖాజాగూడ, బీఎన్‌ఆర్‌హిల్స్‌ ప్రాంతాలను మంత్రి సందర్శించారు. అక్కడున్న యూఎల్‌సీ భూముల్లో నిర్మాణాలు జరుగుతుండటంపై యంత్రాంగాన్ని నిలదీశారు.

ఐటీ కారిడార్‌లో ఎక్కువ..

అదనపు అంతస్తులు, అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు ఐటీ కారిడార్‌లో విపరీతంగా జరిగాయి. నకిలీ యూఎల్‌సీ పత్రాలు సృష్టించడం, అడ్డదారిలో నిర్మాణ అనుమతులు పొందడం అయ్యప్ప సొసైటీ, గురుకుల్‌ ట్రస్టు భూముల్లో సర్వసాధారణమన్న ఆరోపణలున్నాయి. శేరిలింగంపల్లి జోన్‌ వ్యాప్తంగా అదే పరిస్థితి. సాక్షాత్తు జెడ్సీ ఆఫీసు ఎదురుగా సుదర్శన్‌నగర్‌కాలనీలో ఓ నిర్మాణం నిదర్శనం. ఓ వ్యక్తి పక్కింటి ప్రహరీని కూల్చి సెట్‌బ్యాక్‌ స్థలంగా చూపించారు. మూడంతస్తుల భవనం పూర్తిచేశారు. మరో అంతస్తు నిర్మిస్తున్నారు.

యంత్రాలను సమకూర్చుకుంటున్నాం

అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటున్నాం. లాక్‌డౌన్‌ సమయంలో చాలా నిర్మాణాలు పుట్టుకొచ్చినట్లు ఫిర్యాదులు అందాయి. అయ్యప్ప సొసైటీలో ఇప్పటికే 29 భవనాలను కూల్చాం. గురుకుల్‌ సొసైటీ, గోకుల్‌ ఫ్లాట్స్‌లో 20కి పైగా భవనాలపై చర్యలు తీసుకున్నాం. గతంలో మాదిరి స్లాబులకు, గోడలకు చిన్నపాటి చిల్లులు వేయకుండా.. ఈ దఫా పిల్లర్లను కూల్చుతున్నాం. ఫలితంగా నిర్మాణాన్ని మళ్లీ కొనసాగించే వీలుండదు. ప్రభుత్వ, యూఎల్‌సీ, ఇతర వివాదాస్పద భూముల్లో వెలసిన అన్ని నిర్మాణాలను క్రమంగా కూల్చివేస్తాం. భారీ యంత్రాలను సమకూర్చుకుంటున్నాం. ఐదు, ఆరు అంతస్తుల భవనాలను కుప్పకూల్చే యంత్రాల కోసం శేరిలింగంపల్లి జోన్‌ యంత్రాంగం టెండర్లు పిలిచింది.

-దేవేందర్‌రెడ్డి, హైదరాబాద్ నగర ముఖ్య ప్రణాళికాధికారి

ఇదీ చదవండి: రాష్ట్రంలో 36,221కి చేరిన కరోనా బాధితులు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.