ETV Bharat / state

దివ్యాంగుల కోసం దివ్యమైన ఆవిష్కరణ - IIT Madras batch develops standing wheelchair

పుట్టుకతో లేదా ఏదైనా ప్రమాదం కారణంగా అంగ వైకల్యం ఏర్పడితే వారి జీవితం చక్రాల కుర్చీకే పరిమితమవుతుంటుంది. అటువంటి వారు ప్రతి చిన్న అవసరాలకు ఇతరులపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇది అన్ని సమయాల్లో సాధ్యపడకపోవచ్చు. అందుకోసం దివ్యాంగులు ఉపయోగించే చక్రాల కుర్చీ స్థానంలో.. న్యూ బోల్ట్‌ వీల్‌ ఛైర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు... ఐఐటీ మద్రాస్ మిత్రబృందం. దివ్యాంగుల వైకల్య శాతం, జీవనశైలిని బట్టి ప్రత్యేకంగా చక్రాల కుర్చీని రూపొందిస్తున్నారు.

a-divine-invention-for-the-paralyzed
దివ్యాంగుల కోసం దివ్యమైన ఆవిష్కరణ
author img

By

Published : Dec 12, 2020, 5:03 AM IST

దివ్యాంగుల కోసం దివ్యమైన ఆవిష్కరణ

ఐఐటీలు... దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థలు. ఇందులో చదివిన విద్యార్థులు వేతనాల కంటే... సరికొత్త ఆవిష్కరణలకే పెద్దపీట వేస్తారు. అందుకే...ఐఐటీయన్లకు అంత ప్రాధాన్యం. అలా... దివ్యాంగులకు కూర్చునే చక్రాల కుర్చీ వారికి బలం అవ్వాలే కానీ... బలహీనం కాకూడదు అనుకుంది ఓ మిత్రబృందం. అందుకోసం ఆధునిక సాంకేతికతతో న్యూ బోల్ట్‌ వీల్‌ ఛైర్‌ రూపొందించి.... అందరి మన్ననలు అందుకుంటోంది.

అంకుర సంస్థ

ఐఐటీ మద్రాసుకు చెందిన స్వస్తిక్‌ సౌరభ్‌... మిత్రులతో కలిసి న్యూ మోషన్‌ అనే అంకుర సంస్థ స్థాపించాడు. అంగ వైకల్యంతో బాధపడుతున్నవారికి సరికొత్త సాంకేతిక పరికరాలు తక్కువ ధరలో అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేశారు. మెుదటగా... ఆధునిక సాంకేతికతతో కూడిన చక్రాల కుర్చీలను మార్కెట్‌లోకి తీసుకురావాలనుకున్నారు. అందుకోసం దేశవ్యాప్తంగా దాదాపు 200 రకాల చక్రాల కుర్చీలను అధ్యయనం చేశారు. వేల సంఖ్యలో చక్రాల కుర్చీలు వాడుతున్న వారి అనుభవాలు, అవసరాలు తెలుసుకున్నారు.

దూర ప్రాంతాలకు వెళ్లడానికి

ఈ క్రమంలో వీరు రెండు ప్రధాన సమస్యలు గుర్తించారు. అందరూ ఒకే పరిమాణంలో గల పెద్ద సైజు చక్రాల కుర్చీలను ఉపయోగిస్తున్నారు. ఇది... ఒకే సైజు పాదరక్షలను అందరూ వినియోగించటం లాంటిది. ఇప్పటి వరకూ ఉన్న చక్రాల కుర్చీలు బయట దూర ప్రాంతాలకు వెళ్లడానికి అంతగా సరిపోవు. కేవలం ఇంట్లో అవసరాలకే ఉపయోగపడతాయి. ఈ సమస్యను అధిగమించేందుకు... న్యూ బోల్ట్‌ వీల్‌ ఛైర్‌ను రూపొందించారు. ఇంట్లో ఉన్నప్పుడు చక్రాల కుర్చీగా, బయటకు వెళ్లేటప్పుడు మోటరైజ్డ్ వాహనంగా మార్చుకోవచ్చు. అదే న్యూ బోల్ట్‌ ప్రత్యేకత.

దివ్యాంగుల ప్రయాణాలు

చక్రాల కుర్చీకి మోటర్ బైక్​ను అనుసంధానం చేయడం ద్వారా...దివ్యాంగులు బయట ప్రయాణాలు చేయటం మరింత సులభమవుతుంది. ఇందులో లిథియం అయాన్‌ బ్యాటరీని ఉపయోగిస్తున్నారు. నాలుగు గంటల పాటు ఛార్జ్‌ చేస్తే... 30 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. న్యూ మోషన్ రూపొందించిన ఈ చక్రాల కుర్చీ ఎంతో ఉపయోగకరంగా ఉందంటున్నారు...వినియోగదారులు. ఇంట్లో, బయటి అవసరాలకు తగ్గట్టుగా మార్పులు చేసుకునే వీలు ఉండటం అద్భుతం అంటున్నారు. ఫలితంగా, ఎవరిపై ఆధారపడకుండా పని చేసుకునేందుకు దోహదపడుతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

స్వతంత్రంగా జీవించే అవకాశం

చక్రాల కుర్చీ సౌకర్యవంతంగా ఉన్నప్పుడే మరింత ఉత్సాహంగా, స్వతంత్రంగా జీవించే అవకాశం ఉంటుంది. అందుకే... న్యూబోల్ట్‌ వీల్‌ఛైర్‌ ఎంతో ఉత్తమం. ఒక్క ఫొన్‌ కాల్‌ చేస్తే చాలు.... ఈ చక్రాల కుర్చీ విడిభాగాలు సైతం డెలివరీ చేస్తామంటున్నారు.... న్యూ మోషన్‌ సంస్థ సభ్యులు సిద్ధార్థ్.

న్యూ మోషన్ తీసుకువచ్చిన న్యూ బోల్ట్‌ వీల్‌ ఛైర్‌.... నాస్కాం ఫౌండేషన్‌ అవార్డు గెలుచుకుంది. స్టార్టప్ ఇండియా పోటీల్లో రెండవ స్థానం, అంతర్జాతీయ రెడ్‌ క్రాస్‌ నిర్వహించిన పోటీల్లో ఉత్తమ డిజైన్‌ అవార్డులు కైవసం చేసుకుంది. 2025 వరకు... లక్ష మంది దివ్యాంగులకు న్యూ బోల్ట్‌ వీల్‌ ఛైర్లు అందించడమే లక్ష్యంగా న్యూ మోషన్‌ ముందుకు సాగుతోంది.

ఇదీ చూడండి : సైబర్​ నేరాలపై షార్ట్ ఫిల్మ్​.. విడుదల చేసిన సీపీ సజ్జనార్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.