ప్రపంచ వ్యాప్తంగా త్రీడీ ప్రింటింగ్ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. వివిధ రంగాల్లోని సంక్లిష్ట సమస్యలకు సులువైన పరిష్కారం చూపుతోంది. వైద్యరంగంలోనూ త్రీడీ ప్రింటింగ్ తనదైన పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే ఎముకలు వంటివి ఈ సాంకేతికతతో రూపొందిస్తుండగా.. తాజాగా ఐఐటీ హైదరాబాద్(iit hyderabad) పరిశోధకులు కంటి కార్నియా(Cornea 3D Printing)ను ప్రింట్ చేశారు.
జ్ఞానేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. అంతటి ముఖ్యమైన కన్నుపై ఐఐటీ హైదరాబాద్, ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి, సీసీఎంబీకి చెందిన శాస్త్రవేత్తలు వినూత్న(Cornea 3D Printing) ప్రయత్నం చేసి విజయం సాధించారు. త్రీడీ ప్రింటింగ్ ద్వారా కార్నియా(Cornea 3D Printing)ను తయారు చేశారు. కంటికి ఎదైనా గాయమైతే కార్నియా దెబ్బతిని చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. తీవ్రతను బట్టి కార్నియాను పూర్తిగా లేదా కొంతమేర మార్పిడి చేయాల్సి ఉంటుంది. ఇందు కోసం దాతల నుంచి సేకరించిన కార్నియాను శస్త్రచికిత్స ద్వారా బాధితుడికి అమర్చాలి. తాజా పరిశోధనతో శస్త్రచికిత్స అవసరం లేకుండానే కార్నియా సమస్య(Cornea 3D Printing)ను పరిష్కరించవచ్చు.
ఐ బ్యాంకుల్లో నిరుపయోగంగా ఉన్న కార్నియా, జంతువధ శాలల నుంచి జంతువుల కార్నయా సేకరించి హైడ్రోజల్ను తయారు చేశాం. దీన్ని త్రీడీ బయో ప్రింటర్ ద్వారా కార్నియాగా ప్రింట్ చేశాం. ఈ కృత్రిమ కార్నియాతో ఎలాంటి శస్త్ర చికిత్స అవసరం లేకుండానే.. కార్నియాను సరిచేయవచ్చు. సహజ కార్నియా టిష్యూలను అభివృద్ధి చెందవచ్చు. -డా. ఫల్గుణిపతి, సహ ఆచార్యుడు, ఐఐటీహెచ్
వాటి నుంచి సేకరించి
ఐఐటీ హైదరాబాద్లోని బయోమెడికల్ ఇంజినీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ ఫల్గుణపతి బృదం, ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి సీనియర్ శాస్త్రవేత్త వివేక్ సింగ్, సీసీఎంబీ సీనియర్ శాస్త్రవేత్త కిరణ్ కుమార్ ఈ పరిశోధనలో(Cornea 3D Printing) కీలక పాత్ర పోషించారు. ఐ బ్యాంకుల్లో నిరుపయోగంగా ఉన్న కార్నియా, జంతువధ శాలల నుంచి జంతువుల కార్నియా సేకరించి డీ సెల్యూలరైజ్‌డ్ కార్నియా మ్యాట్రిక్స్ హైడ్రోజల్(decellularized cornea matrix hydrogel) రూపాంతరం చేస్తున్నారు. దీన్ని త్రీడీ బయో ప్రింటర్ ద్వారా కార్నియాగా ప్రింట్ చేస్తున్నారు. త్రీడీ ప్రింటర్ ద్వారా తయారు చేసిన కార్నియా ద్వారా శస్త్రచికిత్స లేకుండానే గాయమైన కంటిలోని కార్నియా(Cornea 3D Printing)ను సరిచేయవచ్చు. ఈ కృత్రిమ కార్నియా సహజ కార్నియా కణజాలాలను అభివృద్ధి చేయడానికి దోహదపడుతుంది.
త్రీడీ బయో ప్రింటర్ ద్వారా రూపొందించిన కార్నియాతో.. కంటి చూపు సమస్యలను నివారించవచ్చు. దీని ద్వారా శస్త్ర చికిత్స అవసరం లేకుండానే సులభంగా చేయొచ్చు. అంతే కాకుండా కేరిటోకానస్కు సైతం ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు. కార్నియా సమస్యలతో బాధపడుతున్నవారి కంటికి అనుగుణంగా ఈ త్రీడీ బయోప్రింటర్ ద్వారా హైడ్రోజల్ను ఉపయోగించి కావాల్సిన రీతిలో కార్నియాను ప్రింట్ తీసే వెసులుబాటు ఉంటుంది. - శిబు చమేట్చల్, పరిశోధక విద్యార్థి
అంతర్జాతీయ జర్నల్స్లోనూ వివరాలు
త్రీడీ కార్నియా(Cornea 3D Printing)పై ఇప్పటికే శాస్త్రవేత్తలు అనేక పరిశోధలు పూర్తి చేశారు. వీరి ఆవిష్కరణ సాధారణ కార్నియా సమస్యలతో పాటు కేరిటోకానస్కు సైతం పరిష్కారం చూపనుంది. పరిశోధన వివరాలు అనేక అంతర్జాతీయ పత్రికల్లోనూ ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధనకు గాంధీయన్ యంగ్ టెక్నాలజీ అవార్డు సైతం వచ్చింది. ఇప్పటికే భారత్తో పాటు అమెరికాలోనూ పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేశారు. ల్యాబుల్లో చేసిన ఫలితాలు విజయవంతం కావడంతో మనుషులపై పరిశోధన చేయడానికి ఈ బృందం సిద్ధం అవుతోంది.
ఇదీ చదవండి: No permission for Jung Siren Rally : ర్యాలీకి అనుమతిలేదు.. అడ్డుకుంటే సహించేది లేదు