ప్రపంచంలోనే మూడో ఫార్మాస్యూటికల్ సత్తా కలిగి ఉన్న బల్క్ డ్రగ్ ఇండస్ట్రీగా భారత్కు పేరుంది. కానీ మందుల తయారీలో భాగంగా ఉపయోగించే మధ్యస్థ, ముడిపదార్థాల కొరకు చైనాపైనే ఎక్కువ ఆధారపడాల్సి వస్తోంది. దీన్ని తగ్గించేందుకు ప్రస్తుతం భారత్లోని ఔషద కంపెనీలు కృషి చేస్తున్నాయి.
ఈ క్రమంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ... హైదరాబాద్కు చెందిన లైఫ్ సైన్సెస్ కంపెనీ లాక్సాయ్తో ఆక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడియెంట్లపై కలిసి పని చేసేందుకు ఒప్పందం చేసుకున్నాయి. చైనాపై భారత్ ఆధారపడటాన్ని తమ భాగస్వామ్యం తగ్గిస్తోందని ఇరువర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. యాంటీ కోవిడ్ డ్రగ్స్ తయారీ, హైడ్రాక్సీ క్లోరో క్విన్ తయారీలో భాగంగా ఉపయోగించే మధ్యస్థ పదార్థాల అభివృద్ధి దిశగా తమ భాగస్వామ్యం సాగనున్నట్లు తెలిపాయి. తద్వారా దేశీయంగానే ఈ పదార్థాల ఉత్పత్తి సాధ్యమై మందుల ధర తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: పిల్లల అభ్యర్థనపై తల్లికి పుట్టినరోజు జరిపిన పోలీసులు