హాస్టల్స్ వెంటనే ఓపెన్ చేయాలంటూ ఇండియన్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. సికింద్రాబాద్లోని తార్నాకలో వర్సిటీ గేటు ముందు నినాదాలు చేశారు. కరోనా సమయంలో ఆన్లైన్ క్లాసులకే పరిమితం కావడంతో గతంలో వసతి గృహాలు మూసివేశారు. దీంతో విద్యార్థులు క్లాసులు ప్రారంభించాలని.. హాస్టల్స్ ఓపెన్ చేయాలని ధర్నా చేపట్టారు.
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నందున అధికారికంగా ఏలాంటి ఆదేశాలు రాకుండా హాస్టల్స్ ఓపెన్ చేసే అవకాశం లేదని ఇఫ్లూ అధికారులు వెల్లడించారు. వివిధ రాష్ట్రాల నుంచి 15 మంది విద్యార్థులు ఆందోళనలో పాల్గొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఎన్నికల కోడ్ ఉన్నందున విద్యార్థులను అదుపులోకి తీసుకుని ఓయూ పీఎస్కు తరలించారు.