గోళ్లకూ
హెయిర్ కండిషనర్‌లో పోషణనిచ్చే సమ్మేళనాలు మెండుగా ఉంటాయి. గోళ్లకు నూనెతో మర్దనా చేసుకునేవారు ఈసారి కాస్త కండిషనర్ను రాసి మర్దన చేసి ఐదు నిమిషాల తర్వాత కడిగేయండి. మృదువైన గోళ్లు మీ సొంతమవుతాయి.
స్క్రబ్‌లా
ఈ హెయిర్ కండిషనర్ను బాడీ స్క్రబ్‌లానూ వాడొచ్చు. పావు కప్పు బ్రౌన్ షుగర్‌లో కొద్దిగా కండిషనర్, చెంచా నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కాళ్లూ, చేతులకు రాసుకొని మృదువుగా మర్దనా చేసుకోవాలి. బ్రౌన్ షుగర్ శరీరంపై ఉండే మృతకణాలను తొలగిస్తే... నిమ్మరసం మురికిని పోగుడుతుంది. అలాగే కండిషనర్ చర్మానికి పోషణను అందించి మృదువుగా ఉంచుతుంది.