ETV Bharat / state

అనుమతి ఇవ్వకున్నా సభ నిర్వహిస్తాం : రామచంద్రారావు - Bjp_Caa_Awereness_Prog_

సీఏఏ,ఎన్​ఆర్​సీ బిల్లులపై హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద రేపు తమ పార్టీ తలపెట్టిన అవగాహన ర్యాలీకి అనుమతి లేకున్నా నిర్వహిస్తామని భాజపా స్పష్టం చేసింది. ఈ మేరకు కోర్ కమిటీలోని విషయాలను ఎమ్మెల్సీ రామచంద్రరావు వెల్లడించారు.

'రేపటి అవగాహన ర్యాలీకి కేంద్ర మంత్రులు'
'రేపటి అవగాహన ర్యాలీకి కేంద్ర మంత్రులు'
author img

By

Published : Dec 29, 2019, 6:16 PM IST

Updated : Dec 29, 2019, 7:28 PM IST

హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద పౌరసత్వ బిల్లుపై రేపు అవగాహన సభ నిర్వహించనున్నట్లు భాజపా ఎమ్మెల్సీ రామచంద్రరావు వెల్లడించారు. ఈ సభ ద్వారా ప్రజలకు పౌరసత్వ బిల్లుపై అవగాహన కల్పిస్తామని అయన పేర్కొన్నారు. నాంపల్లిలోని రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ కోర్ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం పూర్తి వివరాలను ఎమ్మెల్సీ వివరించారు. సభకు అనుమతి ఇవ్వకున్నా... నిర్వహించి తీరతామని రామచందర్ రావు స్పష్టం చేశారు.

సభకు కేంద్ర మంత్రులు...

ఇందిరాపార్కు వద్ద జరిగే సభకు కేంద్ర మంత్రులు, ముఖ్య నాయకులు హాజరుకానున్నారని తెలిపారు. పురపాలక ఎన్నికల కోసం అన్ని మున్సిపాలిటీల్లో ఇంఛార్జీలను నియమించామన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్... ప్రభుత్వ ఒత్తిడి మీద పనిచేస్తున్నట్లు కనిపిస్తోందని ఆక్షేపించారు. రిజర్వేషన్లను రాజకీయ కుట్రతో చేయడం సరికాదని హితవు పలికారు. భాజపా వల్లే మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. తెరాస సౌలభ్యంతో మజ్లిస్ ర్యాలీలు, నిరసనలు చేస్తున్నాయని వివరించారు.

'రేపటి అవగాహన ర్యాలీకి కేంద్ర మంత్రులు'

ఇవీ చూడండి : రేపు కరీంనగర్​, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో సీఎం కేసీఆర్​ పర్యటన

TG_Hyd_51_29_BJP_CAA_Awereness_Prog_AB_3182301 Reporter: Karthik Script: Razaq Note: ఫీడ్ భాజపా కార్యాలయం ofc నుంచి వచ్చింది. ( ) పౌరసత్వ బిల్లుపై రేపు ఇందిరా పార్కు వద్ద అవగాహన సభ నిర్వహిస్తున్నట్లు భాజపా ఎమ్మెల్సీ రామచంద్రరావు వెల్లడించారు. ఈ సభ ద్వారా ప్రజలకు పౌరసత్వ బిల్లుపై అవగాహన కల్పిస్తామని అయన పేర్కొన్నారు. భాజపా కార్యాలయంలో జరిగిన పార్టీ కోర్ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం సమావేశ వివరాలను అయన వివరించారు. ఇందిరాపార్కు వద్ద జరిగే సభకు కేంద్రమంత్రులు ముఖ్య నాయకులు వస్తారని...ఇందిరా పార్కు వద్ద సభకు అనుమతి లేకున్నా సభ నిర్వహించి తీరుతామని రామచందర్ రావు స్పష్టం చేశారు. మున్సిపాలిటీ ఎన్నికల కోసం అన్ని మున్సిపాలిటీలలో భాజపా ఇంచార్జీలను నియమించిందన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వ ఒత్తిడి మీద పనిచేస్తున్నట్లు కనిపిస్తుందని ఆక్షేపించారు. రిజర్వేషన్లను రాజకీయ కుట్రతో చేయడం సరికాదన్నారు. భాజపా వల్లనే మున్సిపాలిటీలు అభివృద్ది చెందుతాయన్నారు. తెరాస పార్టీ సౌలభ్యంతో మజ్లిస్ పార్టీ ర్యాలీలు నిరసనలు చేస్తున్నాయన్నారు. బైట్: రామచంద్ర రావు, ఎమ్మెల్సీ
Last Updated : Dec 29, 2019, 7:28 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.