సీఎం కేసీఆర్ రేపు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యమానేరు జలాశయం పూర్తిగా నిండిన దృష్ట్యా జలాశయాన్ని పరిశీలించేందుకు సీఎం వెళ్తున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి రహదారి మార్గం గుండా బయలుదేరి నేరుగా వేములవాడ చేరుకుంటారు. రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని... దేవాలయ అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తారు. అనంతరం మధ్యమానేరు జలాశయం ప్రాంతానికి చేరుకుంటారు. మధ్యమానేరు శ్రీ రాజరాజేశ్వర జలాశయం ప్రస్తుతం 25 టీఎంసీలకు పైగా నీటితో కళకళలాడుతోంది. జలాశయాన్ని పరిశీలించడంతో పాటు అనంతగిరి జలాశయానికి నీటి విడుదల తదితర అంశాలపై అధికారులు, ఇంజినీర్లతో సీఎం కేసీఆర్ చర్చిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి కరీంనగర్‌కు వెళ్లనున్నారు.
రేపు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన - TOMORROW CM KCR VISIT IN KARIMNAGAR, RAJANNA SIRICILLA DISTRICTS

15:22 December 29
రేపు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన