ఎల్‌ఆర్‌ఎస్ ప్రజలకు భారంగా మారిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాలు చూసైనా.. ఎల్‌ఆర్‌ఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
వరద సాయం అందని వారికి ఏడో తేదీ నాటికి అందచేయాలని.. ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వరద సాయం అందించకపోతే ప్రగతిభవన్, జీహెచ్‌ఎంసీ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా...తాము ప్రజల తరఫున పోరాటం చేస్తామని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.
ఇవీచూడండి: రేవంత్, శ్రీధర్ ఎవరైనా ఓకే.. పోటీలో మాత్రం నేనున్నా: కోమటిరెడ్డి