హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'మహిళా దివ్యాంగులు-హక్కుల'పై సదస్సు జరిగింది. సమాజంలో మహిళా దివ్యాంగులపై జరుగుతున్న వేధింపులపై ప్రధానంగా చర్చ జరిగింది.
సమాజంలో మహిళా దివ్యాంగులు ప్రత్యేక సమస్యలతో సతమతమవుతున్నారని ఐద్వా జాతీయ నాయకురాలు జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు. సమాజం అనేక విధాలుగా అభివృద్ధి చెందుతున్నా వేధింపులు మాత్రం ఆగడం లేదన్నారు. వీటికి పరిష్కార మార్గాలు కనుగొనడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆరోపించారు. ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక డిమాండ్ చేసింది.
ఇవీచూడండి: కరోనాను విపత్తుగా ప్రకటన- మృతుల కుటుంబాలకు పరిహారం