హైదరాబాద్‌లోని కొత్తపేట హుడా కాంప్లెక్స్‌లో వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరుకానున్నారు. వివేకానంద యూత్ ప్రారంభించి 28 సంవత్సరాలవువుతోందని... యూత్ ద్వారా అనేక స్వచ్ఛంద, సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించినట్లు వివేకనంద యువజన సంఘాల సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు జిట్ట బాలకృష్ణారెడ్డి తెలిపారు.
ఇవీ చూడండి: 'పళ్లెత్తుగా ఉన్నాయని పెళ్లానొదిలేశాడు'