దేశంలో అత్యధికంగా కేసులు నమోదవుతున్న13 హాట్ స్పాట్ నగరాల్లో హైదరాబాద్ ఒకటి. భాగ్యనగరంలో సర్వే బాధ్యతలు జాతీయ పౌష్టికాహార సంస్థకు అప్పగించింది. అత్యధిక కేసులు నమోదవుతున్న 5 కంటైన్మెంట్ జోన్లు... ఆదిభట్ల, చందానగర్, మియాపూర్, బాలాపూర్, టప్పాచబుత్రా ప్రాంతాల్లో శాంపిళ్ల సేకరణ జరుగుతోంది. ఒక్కో జోను నుంచి వంద మంది సాంపిళ్లను సేకరించనున్నారు.
స్థానిక ఏఎన్ఎంలు, పోలీసులు, ఆశా వర్కర్ల ఆధ్వర్యంలో రక్త నమూనాలు తీసుకుంటున్నారు. వీటికి ఎలిసా టెస్ట్ నిర్వహించి యాంటీ బాడీస్ గురించి తెలుసుకుంటారు. వైరస్ వ్యాప్తి , స్త్రీ, పురుషుల్లో వ్యాధి విస్తరణ, ప్రభావం వంటి అంశాలు తెలుసుకోవడంలో ఈ సర్వే ఎంతగానో ఉపయోగపడుతుందని ఎన్‌ఐఎన్ ప్రతినిధులు తెలిపారు. శనివారం ప్రారంభమైన సీరం సర్వే ఆదివారం కొనసాగుతుంది. మొత్తం 500 శాంపిళ్లు సేకరించి చెన్నైకి పంపిస్తారు.