జగన్ అక్రమాస్తుల కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి క్వాష్ పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి పంపించాలని హైకోర్టు సింగిల్ జడ్జి నిర్ణయించారు. ఆ కేసులో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు నిందితుడిగా ఉన్నందున.. సీజే ధర్మాసనానికి నివేదించాలని రిజిస్ట్రీని జస్టిస్ లక్ష్మణ్ ఆదేశించారు.
జగన్ అక్రమాస్తుల కేసులో భాగంగా పెన్నా గ్రూపునకు లబ్ధికి సంబంధించి సీబీఐ దాఖలు చేసిన అభియోగపత్రంలో తన పేరు తొలగించాలని కోరుతూ హైకోర్టును శ్రీలక్ష్మి ఆశ్రయించారు. అదే అభియోగపత్రంలో తెలంగాణ మంత్రి, ఏపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు నిందితులుగా ఉన్నారు. ప్రజా ప్రతినిధులు నిందితులుగా ఉన్నందున.. పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ జరపాల్సి ఉంటుందని సింగిల్ జడ్జి పేర్కొన్నారు.
ఇదీ చదవండి : గ్రేటర్ పోరుకు ఏర్పాట్లు పూర్తి.. బరిలో 1,122 మంది అభ్యర్థులు