రాష్ట్రంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు బదిలీ(IAS Officers Transfer) అయ్యారు. రవాణా, ఆర్అండ్బీ శాఖ బాధ్యతలను సుదీర్ఘ కాలంగా నిర్వహిస్తున్న సునీల్ శర్మను బదిలీ చేశారు. ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సునీల్ శర్మను నియమించారు. గృహనిర్మాణ శాఖ బాధ్యతలను కూడా ఆయన అదనంగా నిర్వర్తిస్తారు.
ఇప్పటి వరకు ఇంధన శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న సందీప్ కుమార్ సుల్తానీయాను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు. పర్యాటక, క్రీడల శాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీనివాసరాజును రవాణా, ఆర్అండ్బీ కార్యదర్శిగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చదవండి: Revanth reddy comments on KCR: కేసీఆర్ ఆ పని చేసిఉంటే.. ఏపీ సీఎం జగన్తో జల వివాదం ఉండేదా?