IAS Officers Transfer in Telangana : రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులతో పాటు, 11 మంది సీనియర్ ఐఏఎస్(IAS) అధికారులను కీలక స్థానాల్లో బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించిన సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్‌ను విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. విద్యాశాఖ కార్యదర్శిగా వాకాటి కరుణ స్థానంలో బుర్ర వెంకటేశంను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్‌గా కూడా వెంకటేశం అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు.
పర్యావరణం, అడవులు, శాస్త్ర, సాంకేతిక శాఖల ముఖ్య కార్యదర్శిగా ఎ.వాణి ప్రసాద్ నియమితులయ్యారు. ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్‌గా కూడా వాణి ప్రసాద్ అదనపు బాధ్యతల్లో కొనసాగనున్నారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా అర్వింద్ కుమార్ స్థానంలో దాన కిషోర్‌ను ప్రభుత్వం నియమించింది. హెచ్ఎండీఏ కమిషనర్‌గా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్‌గా కూడా దాన కిషోర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. కె.ఎస్.శ్రీనివాస రాజును ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ జీవో జారీ అయింది.
Senior IAS Officers Transfers in Telangana : రాహుల్ బొజ్జాను సాధారణ పరిపాలన, జీఏడీ కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా, కమిషనర్‌గా కూడా ఆయన అదనపు బాధ్యతల్లో కొనసాగనున్నారు. వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల కార్యదర్శిగా క్రిస్టియాన నియమితులయ్యారు. హైదరాబాద్ జలమండలి ఎండీగా సి.సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. వాణిజ్య పన్నుల కమిషనర్ డీకే శ్రీదేవి, మహిళ, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్‌గా వాకాటి కరుణ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల డైరెక్టర్‌గా ఆర్.వి.కర్ణన్ నియమితులయ్యారు.
ఐఏఎస్ అధికారుల జీతం ఎంతో తెలుసా? ఆ 7 బెనిఫిట్స్ కూడా!
బదిలీ అయిన ఐఏఎస్ అధికారుల వివరాలు :
- పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ బదిలీ
- విపత్తు నిర్వహణశాఖకు అర్వింద్ కుమార్ బదిలీ
- పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శిగా దాన కిశోర్
- హెచ్‌ఎండీఏ, సీడీఎంఏ కమిషనర్‌గా దాన కిశోర్‌కు అదనపు బాధ్యతలు
- విద్యా శాఖ ముఖ్యకార్యదర్శిగా బుర్రా వెంకటేశం
- కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌గా బుర్రా వెంకటేశంకు అదనపు బాధ్యతలు
- అటవీ, పర్యావరణశాఖ ముఖ్యకార్యదర్శిగా వాణిప్రసాద్
- ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్ జనరల్‌గా వాణిప్రసాద్‌కు అదనపు బాధ్యతలు
- ఆర్ అండ్‌బీ శాఖ ముఖ్యకార్యదర్శిగా కె.ఎస్.శ్రీనివాసరాజు
- జీఏడీ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా
- ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జాకు అదనపు బాధ్యతలు
- వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా
- జలమండలి ఎండీగా సుదర్శన్ రెడ్డి
- వాణిజ‌్యపన్నుల శాఖ కమిషనర్‌గా టి.కె.శ్రీదేవి
- మహిళా శిశుసంక్షేమశాఖ కార్యదర్శిగా వాకాటి కరుణ
- వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా ఆర్.వి.కర్ణన్
బదిలీ అయిన ఐపీఎస్ అధికారుల వివరాలు
- హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు సీపీగా విశ్వప్రసాద్
- హైదరబాద్ సిట్, క్రైమ్స్ జాయింట్ సీపీగా ఎ.వి.రంగనాథ్
- పశ్చిమ మండలం డీసీపీగా ఎస్.ఎం.విజయ్ కుమార్
- హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ డీసీపీగా జోయల్ డేవిస్
- ఉత్తర మండలం డీసీపీగా రోహిణి ప్రియదర్శిని
- హైదరాబాద్ సీసీఎస్ డీసీపీగా ఎన్.శ్వేత
- హైదరాబాద్ ట్రాఫిక్-1 డీసీపీగా ఎస్ సుబ్బరాయుడు
- నితిక పంత్, గజరావ్‌భూపాల్, చందన దీప్తి డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరితో పాటు మరో ఐదుగురు నాన్ క్యాడర్ ఎస్పీలను బదిలీ చేస్తూ హోంశాఖ నోట్ విడుదల చేసింది.
పాలనను పరుగులు పెట్టించే దిశగా ఆలోచన - త్వరలోనే అధికార యంత్రాంగ ప్రక్షాళణ
త్వరలో భారీ ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు - సీఎస్, నిఘా అధిపతితో సీఎం సుదీర్ఘ భేటీ!