ETV Bharat / state

IAS officer Complaint on Wife Harassment : నా భార్య, బామ్మర్దిల టార్చర్ తట్టుకోలేక పోతున్నా.. పోలీసులకు IAS​ అధికారి ఫిర్యాదు - Hyderabad IAS officer Complaint on Wife Harassment

IAS officer Complaint on Wife Harassment : రాష్ట్రంలో ఉన్నతాధికారులకు సైతం వేధింపులు తప్పడం లేదు. తాజాగా తెలంగాణ కేడర్​కు చెందిన ఐఏఎఎస్​ అధికారి.. తనపై తప్పుడు కేసులు పెట్టడంతో పాటు వేధింపులకు గురి చేస్తున్న భార్య, ఆమె కుంటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్​ బంజారాహిల్స్​లో జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Family Members Threatened Telangana IAS officer
IAS Officer Complaint Against Family Members
author img

By

Published : Aug 7, 2023, 1:15 PM IST

Hyderabad IAS officer Complaint on Wife Harassment : వేధింపులు.. ఇప్పుడు సామాన్యుల నుంచి అధికారులు.. ఆఖరికి ప్రజాప్రతినిధులకూ తప్పడం లేదు. అయితే చాలా కేసుల్లో భర్తల వల్ల భార్యలకు వేధింపులు ఎదురవుతున్నాయి. కొన్ని కేసుల్లో భార్యలు భర్తలను వేధిస్తున్నారు. కానీ ఇలాంటి కేసులు పోలీస్ స్టేషన్ దాకా రావడం చాలా అరుదు. పరువు కోసం చాలా మంది పురుషులు.. తాము భార్యా బాధితులమని చెప్పుకోలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో సదరు భార్యలు ఇదే అదనుగా చేసుకుని వారిపై వేధింపులకు పాల్పడుతున్నారు. గట్టిగా మందలిస్తే.. తమనే చిత్రహింసలు పెడుతున్నారంటూ పురుషులపై కొంతమంది మహిళలు రివర్స్ గేమ్ ఆడుతూ తప్పుడు కేసులు పెడుతున్నారు. తాజాగా హైదరాబాద్​లో ఓ ఐఏఎస్​కు ఇలాంటి సమస్యే వచ్చి పడిందట. ఇంతకీ ఆయన ఎవరు..? అసలేం జరిగిందో తెలుసుకుందామా..?

IAS officer Complaint on Wife Harassment in Hyderabad : తనపై తప్పుడు కేసులు పెట్టడంతో పాటు పలు రకాలుగా వేధింపులకు గురి చేస్తున్న భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ ఐఏఎస్‌ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన హైదరాబాద్​లోని బంజారాహిల్స్​లో చోటుచేసుకొంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్యూన్ కాళ్లు మొక్కిన జిల్లా కలెక్టర్​.. ట్రాన్స్​ఫర్​పై వెళ్తూ.. తనకు సేవ చేశారని..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన సందీప్‌ కుమార్‌ ఝా.. తెలంగాణ కేడర్‌లో ఐఏఎస్‌ అధికారిగా పని చేస్తున్నారు. ఆయనకు 2021 నవంబర్‌ 21వ తేదీన పల్లవి ఝాతో వివాహం జరిగింది. పెళ్లి తరువాత బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో 25 రోజులు మాత్రమే భార్యతో కలిసి ఉన్నారు. అనంతరం భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. అవి చినికి చినికి గాలి వానలా మారినట్లు.. పెద్ద గొడవలుగా మారాయి. దాంతో ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు.

తన భార్య.. తనతో పాటు కుటుంబ సభ్యులతో తరచూ గొడవ పడేదని సందీప్​ కుమార్​ ఝూ ఆరోపించారు. అంతేగాక ఆమె సోదరుడు తన ఇంట్లో రూ. 65 వేలు దొంగిలించినట్లు సందీప్ కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి నుంచి పల్లవి ఝా ఆమె తండ్రి ప్రమోద్‌ ఝా, సోదరుడు ప్రంజాల్‌ ఝా తనను వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలిపారు. అంతే గాక తప్పుడు ఆరోపణలతో బిహార్‌లో కేసులు నమోదు చేశారని వాపోయారు. సొంతూరులోని తన ఇంటిపై దాడి చేసి కుటుంబ సభ్యులను సైతం గాయపరిచి.. వారిని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

తనపై తప్పుడు ఆరోపణలతో తన భార్య, బామ్మర్ది, మామ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు మెయిల్‌ ద్వారా ఫిర్యాదులు చేస్తున్నారని సందీప్​ కుమార్​ ఆరోపించారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్ పోలీసులను ఆయన కోరారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

మహిళా ఐపీఎస్​పై కారులో లైంగిక వేధింపులు.. మాజీ ఏడీజీపీకి మూడేళ్ల జైలు శిక్ష

Women Blackmail Case in Hyderabad : రూ.లక్షలు ఇస్తానంటూ మత్తులోకి దించి.. నగ్నంగా చిత్రీకరించి.. ఆపై బెదిరింపులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.