ETV Bharat / state

ఆదర్శనీయం... బుర్రా వెంకటేశం​ జీవితం... - బుర్రా వెంకటేశం ఐఏఎస్​

పుట్టింది నిరుపేద కుటుంబం... ఒంటరి తల్లి పెంపకం... మారు మూల గ్రామం నుంచి వచ్చిన నేపథ్యం... కానీ ఇవేవి ఆయన విజయానికి ఆటంకం కాలేదు. పట్టుదల, కృషి ఉంటే ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చన్న మాటలే స్ఫూర్తిగా తీసుకున్నారు. నిరంతరం శ్రమిస్తూ ఐఏఎస్​గా ఎదిగారు. వృత్తి పట్ల నిబద్ధతతో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. మానసిక సమస్యలు ఉన్నవారికి పునరావాసం కల్పించి అండగా నిలిచారు. ఆయనే ప్రస్తుతం సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం. ఇటీవల ఆయన రచించిన 'సెల్ఫీ ఆఫ్​ సక్సెస్'​ అమెజాన్​లో కొత్త రచయితలో పుస్తక విక్రయాల్లో తొలిస్థానాన్ని సంపాందించుకుంది. ఎందరికో స్ఫూర్తి దాయకమైన ఆయన జీవిత విశేషాలు మీ కోసం...

బుర్రా వెంకటేశం
author img

By

Published : Jul 25, 2019, 8:28 PM IST

ఆదర్శవంతం... ఈ ఐఏఎస్​ అధికారి జీవితం

ఒకప్పటి వరంగల్ జిల్లా కేశవాపూర్​లోని ఓ నిరుపేద కుటుంబంలో జన్మించారు బుర్రా వెంకటేశం. పసితనంలో తండ్రిని కోల్పోయినా ... తల్లి కష్టార్జితంతో కష్టపడి చదువుకున్నారు. 1992లో ఉస్మానియా యూనివర్శిటీ నుంచి లా పట్టా పొందారు. సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో సివిల్స్​వైపు అడుగులేశారు. నిరంతరం శ్రమించి 1995లో సివిల్స్​ ర్యాంకు సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో గుంటూరు, మెదక్​ జిల్లాల్లో పనిచేశారు. అదే సమయంలో మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి అండగా నిలిచారు. సుమారు 2 వేల మందికి పునరావాసాన్ని కల్పించారు. ఆయన చేసిన పలు సామాజిక కార్యక్రమాలకు... రెడ్​ క్రాస్​ బంగారు పతకాలతో పాటు పలు అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు.

విజయానికి... సెల్ఫీ ఆఫ్​ సక్సెస్​

బుర్రా వెంకటేశం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. మొదటి నుంచి పుస్తకాలంటే మక్కువ పెంచుకున్న ఆయన... తెలుగు, ఆంగ్ల సాహిత్యాలను, అబ్దుల్​ కలాం రాసిన పుస్తకాలను ఆసక్తిగా చదివారు. ఆ స్ఫూర్తితోనే 'సెల్ఫీ ఆఫ్​ సక్సెస్'​ పుస్తకాన్ని రచించారు. జీవితంలో ఒడుదొడుకులు ఎదుర్కొని... విజయం దిశగా అడుగులేసిన వారి జీవిత గాథలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. అమెజాన్​లో విడుదల చేసిన ఈ పుస్తకం న్యూరైటర్స్​ విభాగంలో మొదటి స్థానాన్ని సంపాదించుకుంది. అంతే కాకుండా... పదేళ్లుగా రికార్డులను సొంత చేసుకున్న వారి పలువురి పుస్తకాలను తోసిరాజని ముందుకు దూసుకుపోతోంది.

శ్రమించే తత్వమే విజయానికి మార్గం

నిరంతరం శ్రమించే తత్వమే విజయానికి మార్గమని బుర్రా వెంకటేశం చెబుతారు. విజయం ఏ ఒక్కరి సొత్తు కాదని... తాము ఎంచుకున్న రంగంలో ఏకాగ్రతతో కృషి చేస్తే ఎవరైనా ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని సూచిస్తున్నారు.
ఓ కుగ్రామంలో మొదలైన తన జీవితంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్నప్పటికీ ఎప్పుడూ చెదరని చిరునవ్వు, ఆత్మవిశ్వాసమే ఆభరణాలుగా ముందుకు సాగుతున్నారు ఈ ఐఏఎస్​ అధికారి. సమస్యల్లో ఉన్న వారికి నిత్యం అండగా ఉంటూ ముందుకు సాగుతున్న బుర్రా వెంకటేశం జీవితం ఎందరికో ఆదర్శనీయం.

ఇదీ చూడండి : నేలకు రంధ్రాలు చేశాడు.. భూగర్భ జలాలు పెంచాడు!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.