ETV Bharat / state

ఐ-వెరిఫై విధానాన్ని ప్రారంభించిన డీజీపీ మహేందర్ రెడ్డి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామాకాల్లో భాగంగా ధ్రువపత్రాల పరిశీలనను ఆన్​లైన్ వేదికగా నిర్వహించనున్నారు. అందుకు ఐ-వెరిఫై విధానాన్ని డీజీపీ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. పోలీసు అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో ఆయన పాల్గొన్నారు.

dgp inaugurated iverify, dgp video conference
ఐవెరిఫై విధానం ప్రారంభించిన డీజీపీ మహేందర్ రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి
author img

By

Published : Apr 20, 2021, 7:49 PM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, రక్షణ విభాగాలు చేపట్టే ఉద్యోగ నియామకాల ధ్రువపత్రాల పరిశీలనను ఆన్​లైన్ ద్వారా చేపట్టే విధానాన్ని డీజీపీ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలోని పోలీస్ జోనల్ ఐజీలు, కమిషనర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఐ-వెరిఫై విధానాన్ని ఆయన ప్రవేశపెట్టారు.

ప్రభుత్వ ఉద్యోగాల నియమకాలతో పాటు విదేశాలకు వెళ్లే అభ్యర్థులు తమ ధ్రువపత్రాలు, ఉద్యోగ, వ్యాపార, ఇమ్మిగ్రేషన్​ల కోసం పోలీసు క్లియరెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని డీజీపీ తెలిపారు. ఈ విధానాన్ని ఆధునికీకరించి ఆటోమెటెడ్ పోలీసు ధ్రువపత్రాల పరిశీలన, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేషన్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. ఈసేవలను www.tspolice.gov.in వెబ్​సైట్ ద్వారా పొందవచ్చని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: సీతారాముల ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ఉండాలి: సీఎం కేసీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.