కరోనా కాలంలో ప్రజలను ఆదుకునేందుకు ప్రయత్నించామే తప్ప లాక్డౌన్ నిబంధనలను ఎక్కడా ఉల్లంఘించలేదని... ఏపీలో గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని స్పష్టం చేశారు. లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘన అంశంలో వైకాపా ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీచేసిన అంశంపై రజిని స్పందించారు. తన ఆరోగ్యాన్ని సైతం పట్టించుకోకుండా ప్రజలకు సేవ చేశానని ఎమ్మెల్యే అన్నారు. నోటీసులు అందిన తర్వాత ఈ అంశంపై సవివరంగా మాట్లాడతానని చెప్పారు.
ఇదీ చూడండి: కేసుల సంఖ్య తగ్గించి చెబుతున్నారు: బండి సంజయ్